Nupur Sharma Comments : కామెంట్స్ కలకలం తీవ్ర దుమారం
బీజేపీ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలపై దుమారం
Nupur Sharma Comments : ముస్లింల ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్తపై భారతీయ జనతా పార్టీ బహిష్కృత నాయకురాలు నూపుర్ శర్మ(Nupur Sharma Comments ) చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా చేశాయి.
ఇప్పటికే ఖతార్ భారత రాయాబిరిని పిలిపించి వివరణ కోరింది. ప్రపంచ వ్యాప్తంగా అరబ్ దేశాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గత వారం ఓ టీవీ చర్చ సందర్బంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ఈ కామెంట్స్ చేశారు.
ఏకంగా యూపీలో తీవ్ర దుమారం రేపాయి. కాన్పూర్ లో రెండు వర్గాలు కొట్టుకునేంత దాకా, రాళ్లు రువ్వుకునేంత దాకా వెళ్లాయి. 40 మంది గాయపడ్డారు. ఇందులో 13 మంది పోలీసులు ఉన్నారు.
ఈ తరుణంలో బీజేపీపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తాయి. ఆ పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. ఏకంగా నూపుర్ శర్మను పార్టీ నుంచి
సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది బీజేపీ క్రమశిక్షణ సంఘం.
ఆమెను తొలగించినా చేసిన కామెంట్స్ మాత్రం ఇంకా దుమారం రేపుతున్నాయి. తను కావాలని కామెంట్స్ చేయలేదని మనసు నొప్పిస్తే క్షమించమంటూ కోరింది నూపుర్ శర్మ (Nupur Sharma Comments)
అంతలోపే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. మహమ్మద్ ప్రవక్త పై ఇస్లామోఫోబిక గా అభివర్ణించడాన్ని సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి.
వాణిజ్యాన్ని ప్రోత్సహించే క్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ లో పర్యటించిన సమయంలో ఈ వివాదం చోటు చేసుకుంది.
సౌదీ అరేబియా ఈ కామెంట్స్ ను అవమానకరమైనదిగా పేర్కొంది.
రియాద్ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ లోని భారతీయ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో ఖతార్ , కువైట్ , ఇరాన్ దేశాలు
ఆదివారం భారత రాయబారిని పిలిపించాయి.
బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరాయి గల్ఫ్ దేశాలు. ఇరాన్ కూడా తప్పు పట్టింది. సౌదీ లోని జెడ్డా నగరానికి చెందిన ఆర్గనైజేషన్ ఆఫ్
ఇస్లామిక్ కో ఆపరేషన్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది.
ఇదిలా ఉండగా బీజేపీ రంగంలోకి దిగినా జరగాల్సిన నష్టం జరిగి పోయింది. భారత విదేశాంగ విధానం గొప్పదిగా ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయం నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దెబ్బకు ఇబ్బంది పడేలా చేసింది.
Also Read : యోగి మామూలోడు కాదు దమ్మున్నోడు