NZ vs IRE T20 World Cup : ఐర్లాండ్ పై విక్టరీ సెమీస్ కు కివీస్
35 పరుగుల తేడాతో పరాజయం
NZ vs IRE T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు చేరింది. ఈ మెగా టోర్నీలో మొదటి జట్టు సెమీస్ కు చేరడం. లీగ్ మ్యాచ్ లో భాగంగా ఐర్లాండ్ తో(NZ vs IRE T20 World Cup) జరిగిన మ్యాచ్ లో కీవీస్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది.
టాస్ ఓడి పోయిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐర్లాండ్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. జాషువా లిటిల్ 3 , గారెత్ డెలానీఈ 2 వికెట్లు తీశారు. విచిత్రం ఏమిటంటే జాషువా లిటిల్ చరిత్ర సృష్టించాడు.
హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఇక కీవీస్ ఓపెనర్లు అలెన్ 32 పరుగులు చేస్తే డెవాన్ కాన్వే 28 రాణించారు. స్టార్టింగ్ లోనే గట్టి పునాది వేశారు. అనంతరం రంగంలోకి వచ్చిన కేన్ మామగా అంతా ముద్దుగా పిల్చుకునే విలియమ్సన్ ధాటిగా ఆడాడు. 35 బంతులు ఆడి 5 ఫోర్లు 3 సిక్సర్లతో రెచ్చి పోయాడు.
61 పరుగులు చేశాడు. జట్టు స్కోర్ లో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ కు తోడుగా డారిల్ మిచెల్ 31 రన్స్ చేసి సత్తా చాటడంతో భారీ స్కోర్ చేసింది. 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం మైదానంలోకి దిగిన ఐర్లాండ్ ప్రారంభం నుంచే ధాటిగా ఆడడం మొదలు పెట్టంది.
పాల్ స్టిర్లింగ్ 37 రన్స్ చేస్తే కెప్టెన్ బల్బిర్నీ 30 పరుగులు చేసి రాణించారు. చివరకు 150 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో ఐసీసీ టి20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది.
Also Read : దక్షిణాఫ్రికాపై పాకిస్తాన్ విక్టరీ