Obed Mc Coy : ఎవరీ ఒబెడ్ మెకాయ్ అనుకుంటున్నారా. ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో ఒక్కసారిగా అంతా తన వైపు చూసుకునేలా చేశాడు. అద్భుతమైన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కీలక పాత్ర పోషించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏరికోరి ఈ బౌలర్ ఎంచుకుంది.
ఎందుకంటే బంతితో మెస్మరైజ్ చేస్తాడన్న నమ్మకం జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కరకు ఉంది కాబట్టే తను సత్తా చాటాడు. తనపై పెట్టుకున్న ఆశల్ని సజీవంగా ఉంచేలా చేశాడు ఒబెడ్ మెకోయ్.
ఓ వైపు యజ్వేంద్ర చహల్ చెలరేగి పోతే మరో వైపు ఒబెడ్ మెకోయ్ మెరుపులు మెరిపించాడు. తనకు ఎదురే లేదని చాటాడు. లైన్ అండ్ లెంగ్త్ తో ప్రత్యర్థులను శాసించాడు.
ఏకంగా 4 ఓవర్లు వేసిన ఒబెడ్ మెకోయ్ (Obed Mc Coy)నాలుగు కీలక వికెట్లు తీశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పతనాన్ని శాసించాడు. ఇక ఒబెడ్ మెకోయ్ అద్భుతమైన బంతులతో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
ఒబెడ్ మెకోయ్ స్వస్థలం వెస్టిండీస్ . వయసు 25 ఏళ్లు. 4 జనవరి 1997లో పుట్టాడు. పూర్తి పేరు ఒబెడ్ క్రిస్టోఫర మెక్ కాయ్. ఎడమ చేతి బ్యాటర్ . ఎడమ చేతి వాటం బౌలర్. ప్రస్తుతం విండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఈ ఏడాది బెంగళూరు వేదికగా జరిగిన మెగా ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ తీసుకుంది. 2018 అక్టోబర్ 24న భారత్ తో వన్డే లో అరంగేట్రం చేశాడు. 8 మార్చి 2019లో ఇంగ్లండ్ తో టీ20 స్టార్ట్ చేశాడు.
Also Read : మహిళా క్రికెట్ పై వినోద్ రాయ్ కామెంట్స్