TSSPDCL : టీఎస్ఎస్పీడీసీఎల్ లో పోస్టుల భ‌ర్తీకి ఓకే

ఏఈ, స‌బ్ ఇంజ‌నీర్, లైన్ మెన్ పోస్టులు

TSSPDCL : తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు తీపి కబురు చెప్పింది ప్ర‌భుత్వం. ఈ మేర‌కు తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్ ) లో జాబ్స్ భ‌ర్తీ కోసం స‌ద‌రు సంస్థ నోటిఫికేష‌న్ (TSSPDCL)జారీ చేసింది.

ఇందులో భాగంగా మొత్తం 1,271 పోస్టుల భ‌ర్తీకి సంబంధించి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పోస్టుల‌కు సంబంధించి 70 అసిస్టెంట్ ఇంజ‌నీర్ (ఎలక్ట్రిక‌ల్ ) విభాగంలో భ‌ర్తీ చేయ‌నున్నారు.

వీటితో పాటు 201 స‌బ్ ఇంజ‌నీర్ (ఎల‌క్ట్రిక‌ల్ ) పోస్టుల‌తో పాటు 1000 జూనియ‌ర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు ఉన్నాయి. ఆయా జాబ్స్ కు గాను విద్యార్థ‌త‌లు, వ‌యో ప‌రిమితి, కేట‌గిరీలో వారీగా ఖాళీల వివ‌రాల‌తో స‌మ‌గ్ర నోటిఫికేష‌న్ కు సంబంధించి సంస్థ అధికారిక వెబ్ సైట్ లో లేదా టీఎస్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ . కామ్ లో పొందు ప‌ర్చ‌నున్న‌ట్లు సంస్థ వెల్ల‌డించింది.

మ‌రో వైపు ఉత్త‌ర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ , తెలంగాణ జెన్ కో సంస్థ‌ల నుంచి కూడా ఏఈతో పాటు ఇత‌ర కేట‌గిరీలో వారీగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు రానున్నాయ‌ని స‌మాచారం.

మ‌రో వైపు రాష్ట్రంలో కొత్త‌గా విద్యుత్ ప్లాంట్ల‌ను నిర్మిస్తోంది. ఇందుకు నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి 200కు పైగా ఏఈ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

కాగా కొత్త‌గా వ‌చ్చే పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వ‌చ్చేందుకు దాదాపు ఇంకా మూడు నెల‌ల స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. టెక్నిక‌ల్ కాకుండా నాన్ టెక్నిక‌ల్ పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు రానున్నాయి. వేలాది మంది జాబ్స్ కోసం వేచి చూస్తున్నారు.

Also Read : ఎక్సైజ్..ర‌వాణా శాఖ‌లో పోస్టుల భ‌ర్తీకి ఓకే

Leave A Reply

Your Email Id will not be published!