OLA CEO Dance : ఓలా సీఇఓ డ్యాన్స్ ఓలాలా

బిజిలీ బిజిలీ పాట‌కు మ‌నోడు ఫిదా

OLA CEO Dance  : సంగీతం ఇచ్చే కిక్కు ఇంకేదీ ఇవ్వ‌దు ఈ ప్ర‌పంచంలో. అందుకే దానికి కులం, మ‌తం, వ‌ర్గం, ప్రాంతం అన్న‌ది ఉండ‌దు. సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎవ‌రు ఎప్పుడు వైర‌ల్ అవుతారో. ఇంకెప్పుడు స్టార్లుగా మారుతారో చెప్ప‌లేం.

సామాన్యులు డ్యాన్సు చేస్తే ఎవ‌రూ ప‌ట్టించుకోరు. అదే సెలబ్రిటీలు, సిఇఓలు, ఐకాన్స్ చేస్తే వెంట‌నే హాట్ టాపిక్ గా మారిపోతుంది. తాజాగా ఓలా కంపెనీ సిఇఓ భ‌విష్ అగ‌ర్వాల్(OLA CEO Dance )వైర‌ల్ గా మారారు.

ఎందుకంటే ఆయ‌న ఉన్న‌ట్టుండి ఊగి పోయారు. డ్యాన్సుతో హోరెత్తించారు. ఎందుకంటే త‌న‌ను అంత‌గా ఇంప్రెస్ కు గురి చేసిన ఒకే ఒక్క పాట‌. అది బిజిలీ బిజిలీ సాంగ్. తాను డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆయ‌నే స్వంతంగా పంచుకున్నారు.

ప్ర‌స్తుతం నెట్టింట్లో ఇది హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప్ర‌ధాన కంపెనీల‌న్నీ ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల జ‌పం చేస్తున్నాయి. టెస్లా సీఇఓ మ‌స్క్ నుంచి ఓలా, ఊబ‌ర్ , త‌దిత‌ర కంపెనీల‌న్నీ విద్యుత్ వాహ‌నాల‌పై ఫోక‌స్ పెట్టాయి.

తాజాగా ఓలా సైతం బ్యాట‌రీల సాయంతో న‌డిచే స్కూట‌ర్ల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా కంపెనీ తీసుకు వ‌స్తున్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల కోసం కొత్త ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ను వినియోగ‌దారుల‌కు అందించ‌నున్నారు.

దీని కోస‌మే బిజిలీ బిజిలీ అంటూ డ్యాన్స్ చేశారు. బ్లూటూత్ క‌నెక్టివిటీ ఉంటుంది ఈ వాహ‌నానికి. ఎంచ‌క్కా సంగీతం వింటూ హాయిగా జ‌ర్నీ చేసేందుకు వీలుగా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను తీసుకు వ‌చ్చారు ఓలా.

Also Read : విప్రో బిజినెస్ హెడ్ గా స‌త్య ఈశ్వ‌ర‌న్

Leave A Reply

Your Email Id will not be published!