Neeraj Chopra : ఘనంగా ఒలింపిక్ విజేత ‘నీరజ్ చోప్రా’ పెళ్లి వేడుకలు

చిత్రాలలో కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది...

Neeraj Chopra : ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి భారత్‌‌కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుక చాలా తక్కువ మంది సమక్షంలో ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో నీరజ్ చోప్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలను చూసిన అభిమానులను ఆశ్చర్యపోయారు. సడన్ షాక్ ఇచ్చారేంటని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రాలలో కొంత మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Neeraj Chopra Marriage Updates

నీరజ్ చొప్రా(Neeraj Chopra) భార్య హిమాని మోర్ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి, చివరిసారిగా 2017లో ఆడింది. హిమాని హర్యానాలోని లార్సౌలికి చెందినది. సోనిపట్‌లోని లిటిల్ ఏంజిల్స్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె ప్రస్తుతం అమెరికా మసాచుసెట్స్‌లోని అమ్హెర్స్ట్‌లోని మెక్‌కార్మాక్ ఇసెన్‌బర్గ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది. ఇద్దరూ కలిసి ఈ కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. పెళ్లి సంభ్రమంలో వారు కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ కార్యక్రమాన్ని చాలా గోప్యంగా ఉంచినట్లు స్పష్టమవుతోంది. కానీ చోప్రా ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చెక్కర్లు కోడుతున్నాయి.

ఇటీవల ఒక మీడియా సంస్థతో వివరణాత్మక ఇంటర్వ్యూ ఇచ్చిన నీరజ్ చోప్రా, ఇంత త్వరగా తన వివాహాన్ని చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. ఆదివారం నీరజ్ చోప్రా ఖాతా నుంచి చిత్రాలను పోస్ట్ చేసిన వెంటనే, ఎవరూ దానిని ఒకేసారి నమ్మలేకపోయారు. కానీ కొంతకాలం తర్వాత నీరజ్ చోప్రా వివాహం చేసుకున్నట్లు నిర్ధారించబడింది. అయితే నీరజ్ చోప్రా ఖాతా నుంచి మూడు చిత్రాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఒక ఫోటోలో ఆయన తన భార్య హిమానితో కలిసి కనిపిస్తున్నాడు. రెండో చిత్రంలో నీరజ్ దగ్గర కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు. మూడో చిత్రంలో నీరజ్ తల్లిదండ్రులు ఎడమవైపు కూర్చుని ఉండటం కనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ కొత్త ప్రయాణం వారికి శాంతి, ఆనందం, విజయాలను తీసుకురావాలని ఆశిస్తూ అనేక మంది సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

2020 టోక్యోలో జరిగిన పురుషుల జావెలిన్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో పతకం సాధించిన మొదటి భారతీయుడు. సమ్మర్ గేమ్స్‌లో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన రెండో భారతీయుడు. ఆయన పారిస్ 2024లో రజత పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. 27 ఏళ్ల నీరజ్ ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ 2022లో డైమండ్ లీగ్ విజేత. 2018లో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్నాడు. ఆసియా క్రీడల్లో రెండుసార్లు బంగారు పతకాలు దక్కించుకున్నాడు.

Also Read : TTD Darshan : నేటి నుంచి యథావిధిగా శ్రీవారి అన్ని దర్శనాలు

Leave A Reply

Your Email Id will not be published!