Supreme Court EC : ఈసీ నియామ‌కాల‌పై సుప్రీం షాక్

పీఎం, ప్ర‌తిప‌క్ష నేత‌, సీజేఐ ప్యానల్

Supreme Court EC : భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది మోదీ ప్ర‌భుత్వానికి. త‌మ ఇష్టానుసారం ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మించ‌డానికి వీలు లేద‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది. దేశానికి ప్ర‌జాస్వామ్యం గుండెకాయ లాంటిది. దీనిని ప‌దిలంగా కాపాడు కోవాలంటే ఎన్నిక‌ల సంఘం అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉందని స్ప‌ష్టం చేసింది. గురువారం కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ల నియామ‌కాల‌పై జ‌రిగిన విచార‌ణ‌లో కీల‌క తీర్పు చెప్పింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టింగేష‌న్ (సీబీఐ) చీఫ్ త‌ర‌హాలోనే ఎన్నిక‌ల క‌మిష‌న్ ను(Supreme Court EC) నియ‌మించాల‌ని తీర్పు చెప్పింది. ఒక ర‌కంగా బీజేపీ స‌ర్కార్ కు చెంప పెట్టు లాంటిదని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది కూడా. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ప్ర‌ధాన‌మంత్రి , ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) తో కూడిన ప్యానెల్ నియ‌మిస్తుంద‌ని తీర్పు చెప్పింది. ఎన్నిక‌ల స్వ‌చ్ఛ‌త‌ను కొన‌సాగించ‌డం త‌మ ముందున్న ప్ర‌ధాన కర్త‌వ్య‌మ‌ని పేర్కొంది.

దేశ వ్యాప్తంగా ఎన్నిక‌లను ప‌ర్య‌వేక్షించే ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు, ఇద్ద‌రు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌ను ముగ్గురు స‌భ్యుల క‌మిటీ స‌ల‌హా మేర‌కు రాష్ట్ర‌ప‌తి నియ‌మిస్తార‌ని సుప్రీంకోర్టు ఏక‌గ్రీవ తీర్పులో పేర్కొంది. ఎన్నిక‌లు నిస్సందేహంగా న్యాయంగా జ‌ర‌గాల‌ని లేక పోతే ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నం(Supreme Court EC) పేర్కొంది. ప్ర‌జాస్వామ్యంలో ఎన్నిక‌ల స్వ‌చ్ఛ‌త త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించ‌బ‌డాలి. లేక‌పోతే ఇది వినాశ‌క‌ర‌మైన ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని హెచ్చ‌రించింది.

Also Read : బుల్డోజ‌ర్ల దెబ్బ‌కు పూలు పూశాయి – యోగి

Leave A Reply

Your Email Id will not be published!