AP Deputy CM : ఏపీ దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌లు

డిప్యూటీ సీఎం కొట్టు స‌త్య‌నారాయ‌ణ

AP Deputy CM :  భ‌క్తుల సౌలభ్యం కోసం మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు ఏపీ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రంలోని ఆల‌యాల‌ను సంద‌ర్శించేందుకు వ‌స్తుండ‌డంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది.

ఇందులో భాగంగా ప్ర‌ముఖ దేవాలయాల‌లో ఆన్ లైన్ సేవ‌ల‌ను అందించేందుకు నిర్ణ‌యించింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌.

ఇందులో భాగంగా ఎనిమిది ప్ర‌ముఖ ఆల‌యాల్లో ఈ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వెల‌గ‌పూడిలో డిప్యూటీ సీఎం(AP Deputy CM) మీడియాతో మాట్లాడారు.

సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు అన్ని ఆల‌యాల్లోనూ ద‌శ‌ల వారీగా ఆన్ లైన్ సేవ‌ల‌ను విస్త‌రిస్తామ‌ని చెప్పారు.

ప్ర‌ముఖ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ‌శైలం దేవ‌స్థానంలో ఇప్ప‌టికే సాంకేతిక స‌హ‌కారంతో ఆన్ లైన్ సేవ‌ల‌ను స్టార్ట్ చేశామ‌ని తెలిపారు డిప్యూటీ సీఎం.

ఈ ప్ర‌క్రియ‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింద‌ని దీంతో అదే సంస్థ ఇత‌ర ప్ర‌ముఖ ఆల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను ఉచితంగా చేసే బాధ్య‌త‌ను భుజాల‌కు ఎత్తుకుంద‌న్నారు.

ద‌స‌రా మ‌హోత్స‌వం నుంచి విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ దేవాల‌యంలో ఆన్ లైన్ బుకింగ్ సేవ‌ల‌ను ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు కొట్టు స‌త్య నారాయణ‌.

దీంతో పాటు ద్వార‌కా తిరుమ‌ల‌, అన్న‌వ‌రం, సింహాచ‌లం, విశాఖ‌ప‌ట్నం , శ్రీ‌కాళ‌హ‌స్తి, కాణిపాకం, పెనుగంచిప్రోలు ఆల‌యాల్లో కూడా ఆన్ లైన్ సేవ‌లు ప్రారంభించామ‌న్నారు.

దీని ద్వారా ద‌ర్శ‌నం టికెట్లు, గ‌దులు, ఇ – హుండీ , ఇత‌ర సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు.

Also Read : రేప‌టి భ‌విష్య‌త్తు కోసం నేడు పెట్టుబ‌డి

Leave A Reply

Your Email Id will not be published!