India Growth : 2030-31 సవత్సరానికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందంటున్న ఆ సంస్థ
తీరప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వాణిజ్య అవకాశాలు మరింతగా పెరిగి....
India : మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి భారత్ మరో అడుగుదూరంలోనే ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ అనే సంస్థ శనివారం తెలిపింది. 2030-31 నాటికి ఈ గమ్యాన్ని భారత్(India) చేరుకుంటుందని తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి 8.2 శాతంగా ఉంటుందని నివేదిక అంచనా వేసింది. ఆర్థిక వేగాన్ని కొనసాగించడంలో కొనసాగుతున్న సంస్కరణల ప్రాముఖ్యతను సంస్థ తెలియజేసింది. వ్యాపార లావాదేవీలను, లాజిస్టిక్‌లను మెరుగుపరచడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రభుత్వ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించాలని సంస్కరణలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి, పోటీతత్వాన్ని పెంపొందించడానికి నిర్మాణాత్మక మార్పులు కీలకంగా మారతాయని S&P గ్లోబల్ నొక్కిచెప్పింది. భారత్ ఈక్విటీ మార్కెట్లు కూడా బలమైన వృద్ధి దిశగా పయనిస్తున్నాయని తెలిపింది. భారత ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులు పెరగడాన్ని నివేదిక ఎత్తిచూపింది. వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవడానికి దేశానికి అనేక సౌలభ్యాలున్నాయి. వాటిల్లో ఓడరేవులు ఒకటి.
India Growth Update
తీరప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పిస్తే వాణిజ్య అవకాశాలు మరింతగా పెరిగి.. దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని సంస్థ వెల్లడించింది. భారతదేశ వాణిజ్యంలో దాదాపు 90 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతున్నందున ఎగుమతులు, దిగుమతులు పెరగడానికి మౌలిక వసతుల కల్పన ప్రాధాన్యాన్ని వివరించింది. పెరుగుతున్న ఇంధన అవసరాలను ప్రస్తావిస్తూ.. పునరుత్పాదక, కాలుష్య రహిత ఇంధనాల వాడకంవైపు భారత్ పయనిస్తోందని చెప్పింది. ఈ మార్పు దేశ ఇంధన భద్రతను దాని వాతావరణ లక్ష్యాలతో సమతుల్యం చేయడానికి కీలకమైందిగా పేర్కొంది. వ్యవసాయంలో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఉత్పాదకతను మెరుగుపరచడానికి అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించింది. అయితే ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వం, నీటిపారుదల, ఆహార నిల్వ, పంపిణీకి సంబంధించిన కీలక సవాళ్లను భారత్ ఎదుర్కుంటుందని చెప్పింది.
Also Read : TG Weather : హైదరాబాద్ కు మరో రెండు రోజులు భారీ వర్షాలు