Dhanashree Yuzvendra : మా బంధం బలీయమైనది – ధనశ్రీ
విడి పోయారన్న వార్తలు అబద్దం
Dhanashree Yuzvendra : గత కొన్ని రోజులుగా ప్రముఖ క్రికెటర్ , స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ , ధనశ్రీ(Dhanashree Yuzvendra) విడి పోయారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇద్దరూ మౌనంగా ఉండడం కొంత అనుమానాలకు తావిచ్చింది.
ప్రస్తుతం చాహల్ యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుండి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో భారత జట్టు తరపున ఆడనున్నారు. తామిద్దరి మధ్య బంధం బలమైనదని, దానిని ఎవరూ విడ దీయలేరంటూ స్పష్టం చేశారు.
ఆమె తన అధికారికంగా ఇన్ స్టా గ్రామ్ లో స్పష్టం చేసింది. అవన్నీ అవాస్తవాలంటూ పేర్కొంది. ధనశ్రీ ఈ సందర్భంగా రియల్ లైఫ్ అప్ డేట్స్ అనే పేరుతో సుదీర్ఘ లేఖ రాసింది.
వివరణ కూడా ఇచ్చింది. తన జీవితం గురించి, నిరాధారమైన పుకార్ల గురించి కూడా పేర్కొంది. ఈ రకమైన వ్యాఖ్యలు, వార్తలు ద్వేష ఊరితమైనవి, బాధించేవని వెల్లడించారు.
ఆరోగ్య పరంగా మరో శస్త్ర చికిత్స చేయించుకో బోతున్నట్లు తెలిపింది. జీవితంలో ప్రాథమిక విషయాలను తగినంతగా చేయలేక పోతున్నానని స్పష్టం చేసింది. చాహల్ తో సహా ఇతరుల మద్దతు నాకు రావడం ఆనందం కలిగించిందన్నారు.
నేను కోలుకునేందుకు కొంత సమయం కావాలి. ప్రత్యేకంగా నిద్ర అవసరం. డ్యాన్స్ చేస్తున్న సమయంలో మోకాలి గాయం కారణంగా నేను పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయానని వాపోయారు.
ఈ సమయంలో నా భర్త యుజ్వేంద్ర చాహల్ సహకారం మరిచి పోలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం ధనశ్రీ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఆలోచింప చేస్తున్నాయి.
Also Read : శుభ్ మన్ గిల్ కు భలే చాన్స్