Anil Agarwal : చిప్ కంపెనీ ఏర్పాటు మా నిర్ణయం – చైర్మన్
స్పష్టం చేసిన వేదాంత కంపెనీ చైర్మన్
Anil Agarwal : చిప్ కంపెనీ మహారాష్ట్ర నుంచి గుజరాత్ రాష్ట్రానికి తరలి పోవడంపై మరాఠాలో పెద్ద ఎత్తున చర్చకు , రాద్ధాంతానికి దారి తీసింది.
సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వాకం, బాధ్యతా రాహిత్యం కారణంగానే గుజరాత్ కు వెళ్లిందంటూ ఆరోపించారు శివసేన మాజీ మంత్రి ఆదిత్యా ఠాక్రేతో పాటు ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే(Supriya Sule).
దీంతో చిప్ కంపెనీ తరలి పోవడం గురించి స్పందించింది సంకీర్ణ సర్కార్. ఈ మేరకు మంత్రి ఆనంద్ సమంత కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందుకు సంబంధించి సీఎం ఏక్ నాథ్ షిండే పీఎం మోదీతో మాట్లాడారని అంతకంటే గొప్ప కంపెనీని మహారాష్ట్రకు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.
అయినా చిప్ కంపెనీ తరలి పోవడంపై తీవ్ర రాద్దాంతం చోటు చేసుకుంది. తాజాగా కంపెనీ ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకున్న వేదాంత రిసోర్సెస్ కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్(Anil Agerwal) స్పందించారు.
చిప్ ప్లాంట్ ను గుజరాత్ లో ఏర్పాటు చేయడం అన్నది ఆయా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉండదన్నారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇది తమ స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేశారు.
అయితే ఇదే సమయంలో మహారాష్ట్రలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ కట్టుబడి ఉందన్నారు. ప్రొఫెషనల్ , స్వతంత్ర సలహా ఆధారంగా కంపెనీ గుజరాత్ రాష్ట్రాన్ని ఎంచుకుందన్నారు అనిల్ అగర్వాల్(Anil Agarwal).
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాము కొన్ని నెలలుగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో పలు మార్లు సందర్శించాం. కానీ మరాఠా కంటే గుజరాత్ బెటర్ అని చివరకు నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు.
Also Read : నాగాలాండ్ గ్రూప్ లతో కేంద్రం ఒప్పందం