P Chidambaram : దేశ మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం సంచలన కామెంట్స్ చేశారు. జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన మాలిక్ ఏకంగా 5 వికెట్లు తీశాడు. అందరూ క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. జట్టు ఓటమి పాలైనా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు ఉమ్రాన్ మాలిక్.
అతడి బౌలింగ్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం కూడా ఫిదా అయ్యారు. అంతకు ముందు మరో కాంగ్రెస్ సినయర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ సైతం మాలిక్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
ఈ తరుణంలో చిదంబరం (P Chidambaram )ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెంటనే అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతే కాదు అతడి బౌలింగ్ ను మరింత మెరుగు పర్చుకునేలా కోచ్ ను ఏర్పాటు చేయాలని కోరాడు చిదంబరం.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇంకా తుది జట్టును ఎంపిక చేయలేదు భారత సెలెక్షన్ కమిటీ. శశి థరూర్ , మంత్రి కేటీఆర్ , మాజీ మంత్రి పి. చిదంబరం మూకుమ్మడిగా ఉమ్రాన్ మాలిక్ ను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదే సమయంలో అతడిని జాతీయ జట్టుకు తప్పనిసరిగా తీసుకోవాలని కోరవడం విశేషం. ప్రస్తుతం చిదంబరం చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలనే కాదు రాజకీయ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది.
ఒక బౌలర్ ఇంతలా ఆకట్టు కోవడం ఇటీవలి కాలంలో అరుదు. ఒక రకంగా చెప్పాలంటే మాలిక్ బౌలింగ్ తీరు ఓ తుపానును తలపింప చేసిందన్నాడు చిదంబరం.
Also Read : ఢిల్లీ గెలిచేనా కోల్ కతా నిలిచేనా