P Chidambaram : మోదీ సర్కార్ నిర్ణయం హాస్యాస్పదం
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం
P Chidambaram : మోదీ ప్రభుత్వం ముందూ వెనుకా లేకుండా అసంబద్దమైన నిర్ణయాలు తీసుకుంటోందంటూ మండిపడ్డారు కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం. ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు.
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెట్రోల్ లీటర్ కు రూ. 8.69 , డీజిల్ లీటర్ కు రూ. 7.05 తగ్గింది. దీనిపై పి. చిదంబరం స్పందించారు.
కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించక పోతే లేదా ఎక్కువ గ్రాంట్లు ఇస్తే తప్ప పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు వదులు కోవచ్చా అని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గింపు నోటిఫికేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్సైజ్ డ్యూటీ అనే పదాలు ఉపయోగించింది.
కాగా తగ్గింపు అనేది అదనపు ఎక్సైజ్ డ్యూటీలో ఉంది. ఇది రాష్ట్రాలతో ఏ మాత్రం పంచుకోదన్నారు పి. చిదంబరం(P Chidambaram). అందుకే తాను చెప్పిన దానికి విరుద్దంగా తగ్గింపు భారం ఎవరిపై పడుతుందని నిలదీశారు.
ఇదే సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్, డీజిల్ పై సుంకాల వాటా ద్వారా రాష్ట్రాలు చాలా తక్కువ పొందుతున్నాయని పేర్కొన్నారు.
ధరల నియంత్రణ అనేది ఆయా చమురు, గ్యాస్ కంపెనీలపై ఉండదు. దానిని నియంత్రించాల్సింది, పరిశీలించాల్సింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
Also Read : మోదీ సర్కార్ పై త్యాగరాజన్ ఫైర్