Padma Awards 2022 : కన్నుల పండువగా అవార్డుల ప్రదానం
నీరచ్ చోప్రా ..ప్రభా ఆత్రే..విక్టర్ బెనర్జీ
Padma Awards 2022 : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రకటించిన పద్మ అవార్డుల (Padma Awards 2022 )ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు పురస్కారాల గ్రహీతలు హాజరయ్యారు.
ప్రముఖ క్రీడాకారుడు నీరజ్ చోప్రా, గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీతో పాటు 74 మందికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అవార్డులను బహూకరించారు.
ఈ ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 128 పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. తొలి విడత పంపిణీ కార్యక్రమం ఈనెల 21న జరిగింది. రెండో విడత అవార్డుల పంపిణీ కార్యక్రమం ఇవాళ జరిగింది.
యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ కు మరణాంతరం, గాయకుడు ప్రభా ఆత్రే, నటుడు విక్టర్ బెనర్జీ, భారత్ బయో టెడ్ ఎండీ కృష్ణ ఎల్ల, సతీమణి సుచిత్ర ఎల్లా పద్మ భూషణ్ అవార్డులు పొందారు.
టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ లో భారత్ కు జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు నీరజ్ చోప్రా. అతడితో పాటు పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగవత్ , జావెలిన్ త్రోయర్ అంలేల్ , గాయకుడు సోను నిగమ్ తో పాటు పలువురు అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి పురస్కారాలు అందుకున్నారు.
ప్రతి ఏటా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి కేంద్రం అవార్డులు ప్రకటిస్తుంది. నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ , 107 పద్మ శ్రీ అవార్డులను(Padma Awards 2022 )ప్రకటించింది.
ఈసారి భారతీయులతో పాటు విదేశీయులు, ఎన్నారైలకు కూడా అవార్డులను ప్రకటించింది మోద సర్కార్.
Also Read : అరుదైన దృశ్యం కత్తుల కరచాలనం