Chinna Jeeyar Swamy : చిన జీయర్ స్వామికి పద్మ భూషణ్
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
Chinna Jeeyar Swamy : ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ధర్మ ప్రచారం చేస్తున్న ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజికి అరుదైన పుసర్కారం లభించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డును 2022 సంవత్సరానికి గాను ఎంపిక చేసింది. మొత్తం 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చిన జీయర్ స్వామికి(Chinna Jeeyar Swamy) పెద్ద ఎత్తున భక్తులు ఉన్నారు. తెలంగాణలోని శంషాబాద్ ముచ్చింతల్ లో ఆశ్రమం ఉంది. ఏపీలోని సీతారామంతో పాటు వివిధ దేశాలలో కూడా ఆశ్రమాలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో పేరు పొందారు. అంధులకు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఉచితంగా విద్య, వైద్యం, అన్నదానం , ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తు వస్తున్నారు.
ఇటీవల భారీ ఎత్తున రామానుజుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. భారతీయ గురువులలో పేరెన్నికగన్న వారిలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి ఒకరు. చిన్న తనం నుంచే ఆధ్యాత్మిక భావ జలధారను పుణికి పుచ్చుకున్నారు. సేవా భావాన్ని పెంపొందించేలా చేశారు. 1994 నుండి ఇతర దేశాలలో పర్యటిస్తూ వస్తున్నారు. అమెరికా, లండన్ , సింగపూర్ , హాంకాంగ్ , కెనడాలలో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. యాగాలు నిర్వహించారు.
యువతకు దేశ చరిత్రపై సమగ్ర అవగాహన ఉంటేనే భారతీయ సంస్కృతి అభివృద్ది చెందుతుందని అంటారు. దేశాభివృద్దిలో విద్యార్థులది కీలకమైన పాత్ర అని స్పష్టం చేస్తారు. నవంబర్ 3, 1956లో రాజమండ్రి సమీపంలో పుట్టారు. ఆనాటి నుంచి నేటి దాకా నిరంతరం ఆధ్యాత్మిక ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు.
నైతికత, ధర్మ బద్దమైన జీవితం, సంస్కారవంతమైన విద్య ఉండాలనే ఉద్దేశంతో జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ను హైదరాబాద్ , చెన్నై, యుఎస్ లో స్థాపించారు. శాంతి, సామరస్యం బోధిస్తారు. అత్యంత క్లిష్టమైన వాటిని అందరికీ సులువుగా అర్థం అయ్యేలా విడమరిచి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి.
పలు భాషల్లో పట్టు కలిగిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ కు(Chinna Jeeyar Swamy) అరుదైన పురస్కారం లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగానే కాదు సామాజిక సేవా రంగాలలో ప్రతి ఒక్కరు భాగం పంచుకునేలా చేయడంలో స్వామి వారు చేస్తున్న కృషి ప్రశంసనీయం..సర్వదా అభినందనీయం.
Also Read : కీరవాణికి దక్కిన ‘పద్మం’