Raveena Tandon Padmashri : ఈ పురస్కారం తండ్రికి అంకితం
పద్మశ్రీ దక్కడం ఆనందంగా ఉంది
Raveena Tandon Padmashri : నేను ఏనాడూ అనుకోలేదు. కానీ ఇవాళ దేశంలో అత్యున్నతమైన పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీకి ఎంపిక చేసినందుకు జ్యూరీకి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్. కేంద్ర సర్కార్ మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించి.
ఇందులో 6 పద్మ విభూషణ్ ,9 పద్మభూషణ్ , 95 పద్మశ్రీ లు ఉన్నాయి. జాకీర్ హుస్సేన్ కు పద్మ విభూషణ్ దక్కగా వాణీ జయరామ్ కు పద్మ భూషన్ లభించింది. ఇక రవీనా టాండన్ తో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి పద్మశ్రీ లభించింది. ఇదిలా ఉండగా కీరవాణికి ఇటీవలే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు దక్కింది.
తనకు లభించిన పురస్కారాన్ని తన తండ్రి రవి టాండన్ కు(Raveena Tandon Padmashri) అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను గౌరవించబడ్డాను. కృతజ్ఞతతో ఉన్నాను. భారత ప్రభుత్వం నా రచనలు, నా జీవితాన్ని, నా అభిరుచులను, సినిమా, కళలను కూడా పరిగణలోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపింది రవీనా టాండన్.
ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ సినిమా ప్రయాణంలో నాకు మార్గ నిర్దేశం చేసిన వారందరికీ , దాని ద్వారా నా చేయి పట్టుకున్న వారందరికీ పేరు పేరునా థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నారు సినీ నటి. జీ20లో మహిళా సాధికారత అంశంపై పార్టిసిపేట్ చేశారు నటి రవీనా. రవీనా టాండన్ తెలుగు, హిందీ భాషలకు సంబంధించి పలు సినమాలలో నటించారు. ఇటీవల వెబ్ సీరీస్ లో కూడా నటించారు. హోస్ట్ గా వ్యవహరించారు.
Also Read : కీరవాణికి దక్కిన ‘పద్మం’