PAK SQUAD : స్వదేశంలో ఆసిస్ తో జరిగే పరిమిత ఓవర్ల సీరీస్ లు ఆడేందుకు గాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు – పీసీబీ(PAK SQUAD) ఇవాళ
జట్టును ఎంపిక చేసింది. ఏకైక టీ20 కోసం 20 మంది సభ్యుల్ని ఎంపిక చేసింది.
విచిత్రంగా అన్ క్యాప్డ్ ప్లేయర్లు అఫ్రిదీ, హరీస్ లకు చోటు కల్పించే ప్రయత్నం చేశారు పీసీబీ సిఇఓ, చైర్మన్ రమీజ్ రజా.
ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో కలకలం రేగింది. స్పిన్నర్ గా ఉన్న అఫ్రిది, బ్యాటర్ హరీస్ తాజాగా జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో రాణించారు.
ఒకరికి 35 ఏళ్లు కాగా ఇంకొకరు 20 ఏళ్లు. వీరిద్దరిని సెలెక్టర్లు ఎంపిక చేయడం విస్తు పోయేలా చేసింది. అఫ్రిది 5 మ్యాచ్ లు ఆడి 8 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఇక హారీస్ పరుగుల వరద పారించాడు. అటు టీ20 కి ఇటు వన్డే సీరీస్ కు జట్లను ప్రకటించిన పీసీబీ కెప్టెన్ గా బాబర్ ఆజమ్ ను నియమించింది. తాజాగా రెండు టెస్టు మ్యాచ్ లు ముగిశాయి.
ఈ రెండూ డ్రాగా ముగిశాయి. ఇదిలా ఉండగా వన్డే జట్టుకు టీం ఇలా ఉంది.
బాబర్ ఆజమ్ కెప్టెన్ కాగా షాదాబ్ ఖాన్, షఫీక్ , అసిఫ్ , అలీ, ఫకర్ జమాన్ , హైదర్ అలీ ఉన్నారు.
వీరితో పాటు హరీస్ రౌఫ్, హసన్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్ , హాక్ , షా, హారీస్ , నవాజ్ , రిజ్వాన్ ఉన్నారు.
వసీం జూనియర్ , షకీల్ , షాహీన్ అఫ్రిది, షానవాజ్ దహానీ, ఉస్మాన్ ఖాదిర్ ఆడతారు.
ఇక టీ20 జట్టుకు ఆజమ్ స్కిప్పర్ గా ఉండనున్నారు. షాదాబ్ ఖాన్, అఫ్రిదీ, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్ , అలీ, రౌఫ్, హసన్ అలీ ఆడతారు. ఇఫ్తికార్ , షా, హరీస్, నవాజ్ , రిజ్వాన్ ఉంటారు. వసీం జూనియర్ , షాహీన్ , షానవాజ్ , ఉస్మాన్ ఖాదిర్ ను ఎంపిక చేసింది.
Also Read : ఈసారి ఐపీఎల్ టైటిల్ మాదే – ధావన్