PAK vs BAN T20 World Cup : బంగ్లాకు షాక్ సెమీస్ చేరిన పాక్

5 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం

PAK vs BAN T20 World Cup : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్ప‌టికే గ్రూప్ – ఎ లో న్యూజిలాండ్ , ఇంగ్లండ్ సెమీ ఫైన‌ల్ కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని సాధించింది పాకిస్తాన్(PAK vs BAN T20 World Cup). ఆదివారం ఈ లీగ్ మ్యాచ్ జ‌రిగింది.

సెమీస్ కు చేరాలంటే క‌చ్చితంగా విజ‌యం సాధించాల్సిన మ్యాచ్ లో క‌లిసిక‌ట్టుగా ఆడారు పాక్ ఆట‌గాళ్లు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జ‌ట్టును క‌ట్ట‌డి చేసింది పాక్ బౌల‌ర్లు. 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇంకా 11 బంతులు మిగిలి ఉండ‌గానే విక్ట‌రీ సాధించింది.

ఇక మెగా టోర్నీలో బ‌ల‌మైన జ‌ట్టుగా టైటిల్ ఫెవ‌రేట్ గా ఉన్న ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుపై పిల్ల‌కూనులుగా భావించిన నెద‌ర్లాండ్స్ చుక్క‌లు చూపించింది.

కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇక బంగ్లాదేశ్ జ‌ట్టుపై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపించారు పాకిస్తాన్ బౌల‌ర్లు. సెమీస్ రేసు నుంచి సౌతాఫ్రికా ఇప్ప‌టికే నిష్క్ర‌మించింది.

దీంతో పాటు శ్రీ‌లంక కూడా టోర్నీ నుంచి ఔట్ అయ్యింది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 127 ర‌న్స్ చేసింది.

ఓపెన‌ర్ శాంటో మ‌రోసారి స‌త్తా చాటాడు. ఈ కీల‌క మ్యాచ్ లో మ‌రోసారి మెరిశాడు. 7 ఫోర్ల‌తో 54 ర‌న్స్ చేశాడు. సౌమ్యా స‌ర్కార్ తో క‌లిసి శాంటో 52 ర‌న్స్ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు.

ప‌ది ఓవ‌ర్ల త‌ర్వాత పాక్ బౌల‌ర్లు ప్ర‌తాపం చూప‌డంతో క్రికెట‌ర్లు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. హుస్సేన్ ఆఖ‌రులో 24 ర‌న్స్ చేయ‌డంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. అఫ్రిది 4 వికెట్లు, షాదాబ్ 2 వికెట్లు, ఇఫ్తికార్ , ర‌వూఫ్ చెరో ఒక వికెట్ తీశాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన రిజ్వాన్ 32 ర‌న్స్ చేస్తే ఆజ‌మ్ 25 ప‌రుగులు చేశాడు. హారీస్ 31 ర‌న్స్ చేస్తే షాన్ మ‌హ‌మూద్ 24 స‌త్తా చాటడంతో పాక్ గెలుపొందింది.

Also Read : సెమీ ఫైన‌ల్ కు చేరిన ఇండియా

Leave A Reply

Your Email Id will not be published!