PAK vs SA ICC World Cup : పాక్ గెలిస్తే సరి లేకపోతే ఇంటికే
సఫారీతో దాయాది బిగ్ ఫైట్
PAK vs SA ICC World Cup : ఐసీసీ(ICC) వన్డే వరల్డ్ కప్ 2023లో విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది దాయాది పాకిస్తాన్ జట్టు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ హాట్ ఫెవరేట్ గా ఉంది. కానీ ఊహించని రీతిలో తాడో పేడో తేల్చు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం చెన్నై వేదికగా బలమైన దక్షిణాఫ్రికా జట్టుతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే టోర్నీలో నిలుస్తుంది. లేక పోతే పెట్టే బేడా సర్దుకుని వెళ్లాల్సి ఉంటుంది.
PAK vs SA ICC World Cup Today
ఇదే చెన్నై వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. ఏకంగా 8 వికెట్ల తేడాతో పరాజయం పొందడం విస్తు పోయేలా చేసింది. ఇది ఊహించని పరాజయం. దీంతో మాజీ పాకిస్తాన్ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పిన్నర్లకు అనుకూలించనుంది ఈ మైదానం. దీంతో ఇటు పాకిస్తాన్ అంటు దక్షిణాఫ్రికా వీరినే నమ్ముకోనున్నాయి. దక్షిణాఫ్రికా నాలుగు మ్యాచ్ లలో గెలుపొందింది. పాకిస్తాన్ టీమ్ వరుస ఓటములతో షాక్ కు గురైంది.
వన్డే వరల్డ్ కప్ లో పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో నిలిచింది సఫారీ టీమ్. ఇక పాకిస్తాన్ ఇప్పటి వరకు 5 మ్యాచ్ లలో 2 మ్యాచ్ లలో గెలుపొందింది. నాలుగు పాయింట్లతో సరి పెట్టుకుంది. ఈ మ్యాచ్ సఫారీ కంటే పాకిస్తాన్ కు కీలకం కానుంది.
Also Read : Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ