PAK vs SA ICC World Cup : ఉత్కంఠ పోరులో స‌ఫారీదే హ‌వా

వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి పాకిస్తాన్ ఔట్

PAK vs SA ICC World Cup : చెన్నై – ఐసీసీ(ICC) వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జ‌రిగిన కీల‌క పోరులో దాయాది పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. అనూహ్యంగా చివ‌రి బంతి దాకా నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ సాగింది. ఈ టోర్నీలో ఇదే అత్యుత్త‌మ‌మైన, ఉత్కంఠ భ‌రిత‌మైన మ్యాచ్ గా మాజీ క్రికెట‌ర్లు, అభిమానులు, విశ్లేష‌కులు భావిస్తున్నారు. చావో రేవో తేల్చు కోవాల్సిన స‌మ‌యంలో పాకిస్తాన్ చివ‌రి క్ష‌ణం దాకా పోరాడింది. కానీ దుర‌దృష్టం వారిని వెంటాడింది.

PAK vs SA ICC World Cup Updates

ఇదే టోర్నీలో ద‌క్షిణాఫ్రికా త‌న‌దైన శైలిలో రాణించింది. ఒకే ఒక్క వికెట్ తేడాతో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ 271 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది స‌ఫారీ ముందు.

క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ ను తెప్పించింది. ఈ గెలుపుతో పాయింట్ల ప‌ట్టిక‌లో నెంబ‌ర్ వ‌న్ స్థానానికి ఎగ‌బాకింది స‌ఫారీ జ‌ట్టు. బ్యాటింగ్ చేసిన పాక్ జ‌ట్టులో మ‌రోసారి బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు కెప్టెన్ ఆజ‌మ్. హాఫ్ సెంచ‌రీ చేశాడు. ష‌కీల్ 52 , షాదాబ్ ఖాన్ 43, రిజ్వాన్ 31 , న‌వాజ్ 24 ర‌న్స్ చేశారు. ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో షంసీ 4 వికెట్లు తీస్తే జాన్స‌న్ 3 తీశాడు.

అనంత‌రం బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు 47.2 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఎయిడెన్ మార్క్రామ్ 91 ఒక్క‌డే రాణించాడు. చివ‌రి బ్యాట‌ర్లు పాక్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. దీంతో టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మించింది.

Also Read : PAK vs SA ICC World Cup : పాక్ గెలిస్తే స‌రి లేక‌పోతే ఇంటికే

Leave A Reply

Your Email Id will not be published!