Babar Azam : పాకిస్తాన్ విక్టరీ బాబర్ ఆజం రికార్డ్
రెండో వన్డేలో 77 రన్స్ తో గెలుపు
Babar Azam : స్వదేశంలో వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి వన్డేలో భారీ స్కోర్ ను ఛేదించి గెలుపొందింది.
వన్డే సీరీస్ లో పాక్ కు ఇది వరుస విక్టరీ. ఫస్ట్ వన్డేలో అద్భుతమైన సెంచరీతో దుమ్ము రేపాడు కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam). ప్రపంచ
క్రికెట్ లో స్టార్ ప్లేయర్ గా పేరొందిన భారత్ కు చెందిన విరాట్ కోహ్లీ రికార్డు ను సమం చేశాడు.
గత ఏడాది నుంచి నేటి దాకా ఫుల్ ఫామ్ లో కొనసాగిస్తూ వస్తున్నాడు ఈ కెప్టెన్. పాకిస్తాన్ జట్టుకు మూల స్తంభంగా మారాడు. తాను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ టీమ్ ను నడిపిస్తూ గెలుపు అంచులకు తీసుకు వెళుతున్నాడు.
వరల్డ్ లో ఇప్పుడు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్ల జాబితాలో బాబర్ ఆజం కూడా ఒకడుగా మారాడు. కళ్లు చెదిరే షాట్లతో ఆకట్టుకుంటున్న ఆజం మూడు ఫార్మాట్ లలో ( టెస్టులు, వన్డేలు, టి20లు) రాణిస్తున్నాడు.
పరుగుల వరద పారిస్తున్నాడు పాకిస్తాన్ కెప్టెన్. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముల్తాన్ వేదికగా జరిగిన వన్డేలో ఘన విజయాన్ని నమోదు చేసింది
పాకిస్తాన్.
ఫస్ట్ వన్డేలో సెంచరీ చేస్తే ఈ వన్డేలో ఏకంగా 77 పరుగులు చేసి సత్తా చాటాడు బాబర్ ఆజం. ఇదిలా ఉండగా మూడు ఫార్మాట్ లలో వరుసగా
9 హాఫ్ సెంచరీలను నమోదు చేసిన తొలి బ్యాటర్ గా బాబర్(Babar Azam) నిలిచాడు.
పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 275 రన్స్ చేస్తే విండీస్ 155 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 120 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది పాకిస్తాన్.
ఇక బాబర్ ఆజమ్ విషయానికి వస్తే ఆసిస్ తో జరిగిన టెస్ట్ లో 196, 67, 55 రన్స్ చేశాడు. ఇదే జట్టుతో జరిఇన వన్డేలో 57, 114, 105 పరుగులు చేశాడు.
ఇక ఆసిస్ తో జరిగిన టి20 ఏకైక మ్యాచ్ లో 66 రన్స్ చేస్తే తాజాగా విండీస్ తో జరిగిన వన్డేల్లో 103, 77 కొట్టాడు.
Also Read : కార్తిక్ పై రికీ పాంటింగ్ కామెంట్