Imran Khan Arrest : మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
పాకిస్తాన్ అంతటా పరిస్థితి ఉద్రిక్తం
Imran Khan Arrest : పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అరెస్ట్(Imran Khan Arrest) చేశారు. కోర్టు వెలుపల ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పారా మిలిటరీ సిబ్బంది ఇమ్రాన్ ఖాన్ పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ ను చుట్టు ముట్టిన ఆర్మీ తీసుకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. పీటీఐ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
గత ఏడాది పదవి నుంచి తొలగించినప్పటి నుంచి పెండింగ్ లో ఉన్న డజన్ల కొద్దీ కేసుల్లో ఒక దానిపై విచారణ కోసం ఇస్లామాబాద్ హైకోర్టులో అడుగు పెట్టారు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఇవాళ అరెస్ట్ కావడంతో దేశ మంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోర్టు ప్రాంగణం నుండి అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్యకు చెందిన అల్ ఖాదిర్ ట్రస్ట్ కు బహ్రియా టౌన్ $500 మిలియన్ల విలువైన భూమిని కేటాయించిందనే ఆరోపణలకు సంబంధించింది. ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉందని , ఎవరైనా బయటకు వచ్చినా లేదా నిరసనలు, ఆందోళనలు చేపట్టినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఇస్లామాబాద్ పోలీసులు. కాగా తమ నాయకుడిని పారా మిలిటరీ ఫోర్స్ నెట్టి వేసిందంటూ ఆరోపించింది పీటీఐ.
కాగా పాకిస్తాన్ మంత్రి రాణా సనావుల్లా కీలక ప్రకటన చేశారు. జాతీయ ఖజానాకు నష్టం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్(Imran Khan Arrest) చేయడం జరిగిందని వెల్లడించారు. ఆయనపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొన్నారు.
Also Read : ప్రత్యక్ష ప్రసారంపై సీజేఐ కామెంట్స్