Pahalgam Attack-Pakistan PM : పహల్గామ్ దాడిపై మొదటిసారి స్పందించిన పాక్ ప్రధాని
అందులోభాగంగా తాము ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ స్పష్టం చేశారు...
Pakistan PM : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగి 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్,పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.ఆ క్రమంలో న్యూఢిల్లీ తీసుకున్న పలు నిర్ణయాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా స్పందించారు. పహల్గాం దాడిపై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ఆయన ప్రకటించారు.అందులోభాగంగా తాము ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ స్పష్టం చేశారు.
Pakistan PM Responds on Pahalgam Attack
శనివారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో షెహబాజ్ షరీఫ్(Pakistan PM) ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటన కారణంగా మన దేశం మరోసారి నిందలు ఎదుర్కొంటోందన్నారు. ఆ ఘటనపై తటస్థ,పారదర్శక,విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శాంతికే తమ ప్రాధాన్యని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదాన్ని తాము సైతం ఖండిస్తామని తెలిపారు.
పహల్గాం ఘటన అనంతరం ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ప్రధాని మోదీ స్పందనపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమన్నారు. ఎలాంటి ముప్పును ఎద్కొవడానికైనా తాము సిద్దంగా ఉన్నామన్నారు.ఇక పాకిస్థాన్ లక్ష్యంగా తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు.. పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భారత్ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైప భారత్ తీసుకున్న నిర్ణయాలపై పాక్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు మండిపడిన విషయం విదితమే.
Also Read : MP Arvind : మాజీ సీఎం కేసీఆర్ కు కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం