Pakistan Sports Minister : పాక్ ఆడాలంటే పీఎం ఓకే చెప్పాలి
దేశ క్రీడా శాఖా మంత్రి షాకింగ్ కామెంట్స్
Pakistan Sports Minister : బీసీసీఐ ఆధ్వర్యంలో ఈఏడాది 2023లో నిర్వహించే ఐసీసీ వరల్డ్ కప్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రధానంగా ఒకే ఒక్క జట్టుతో పేచీ వచ్చి పడింది. దాయాది దేశాలైన భారత్ , పాకిస్తాన్ జట్ల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడం ఇందుకు బలం ఇస్తోంది. బీసీసీఐ వర్సెస్ పీసీబీ మధ్య మాటల యుద్దం కొనసాగింది. సరైన భద్రత లేదని దీంతో తమకు ఆట కంటే ఆటగాళ్ల సెక్యూరిటీ ముఖ్యమని ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించారు.
ఆయనతో పాటు కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా సంచలన కామెంట్స్ చేశారు. తమ జట్టుతో ఆడక పోతే తమకు ఏమీ కాదని కానీ పాకిస్తాన్ కు తీరని నష్టం ఏర్పడుతుందన్నారు. ఈ తరుణంలో తటస్థ వేదికలపై ఆడేందుకు తాము ఓకే చెప్పినా బీసీసీఐ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ తాజాగా మెలిక పెట్టారు పాకిస్తాన్ క్రీడా శాఖా మంత్రి(Ehsan Mazari). ఇప్పటికే ఐసీసీ టోర్నీకి సంబంధించి క్రికెట్ టోర్నీ షెడ్యూల్ కూడా ఖరారు చేసింది.
భారత్ లో ఆడే ప్లేస్ లను కూడా ప్రకటించింది. ఇందుకు పీసీబీ ఓకే చెప్పింది. ఈ మేరకు హైదరాబాద్, చెన్నై , అహ్మదాబాద్ లలో ఆడాల్సి ఉంది భారత్ తో పాకిస్తాన్ . కాగా పాకిస్తాన్ వచ్చే కంటే ముందు పాకిస్తాన్ ప్రభుత్వం సెక్యూరిటీ ని భారత్ కు పంపిస్తామని తెలిపింది. కేవలం నివేదిక మీద మాత్రమే తమ నిర్ణయం ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే పీఎంకు అందజేశామన్నారు. మొత్తంగా పాకిస్తాన్ వస్తుందా రాదా అన్నది వేచి చూడాలి.
Also Read : CM KCR Visit : మహంకాళి గుడిలో కేసీఆర్ పూజలు
