Asif Ali Clashed : ఆఫ్గ‌న్ బౌల‌ర్ తో పాకిస్తాన్ క్రికెట‌ర్ గొడ‌వ‌

కొట్టినంత ప‌ని చేసిన ప్లేయ‌ర్ ఆసిఫ్ అలీ

Asif Ali Clashed :  ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ ఇంకే ఆట‌కు ఉండ‌డం లేదు. కానీ ఆట‌గాళ్లు సంయ‌మ‌నం పాటించ‌డంలో క‌ట్టు త‌ప్పుతున్నారు.

ఒక్కోసారి మాట‌ల‌తో యుద్దానికి తెర తీస్తున్నారు. అంతే కాదు దాడి చేసినంత ప‌ని చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ -2022 సూప‌ర్ -4 మ్యాచ్.

ఫైన‌ల్ కు వెళ్లాలంటే త‌ప్ప‌నిస‌రి గెల‌వాల్సిన మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు. చివ‌రి ఓవ‌ర్ దాకా ఉత్కంఠ రేపింది. ఎట్ట‌కేల‌కు కేవ‌లం ఒకే ఒక్క వికెట్ తేడాతో పాకిస్తాన్ విజ‌యం సాధించి నేరుగా ఫైన‌ల్ కు చేరింది.

పాకిస్తాన్ కు చెందిన ఆసిఫ్ అలీ ఆఫ్గ‌నిస్తాన్ బౌల‌ర్ ను కొట్టినంత(Asif Ali Clashed) ప‌ని చేశాడు. ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు దూషించుకున్నారు. ఆసిఫ్ అలీ , ఫ‌రీద్ అహ్మ‌ద్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

130 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగింది పాకిస్తాన్. చివ‌రి ఓవ‌ర్ లో 11 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. మ‌ధ్య‌లో టెయిల్ ఎండ‌ర్లు న‌సీమ్ షా , మ‌హ్మ‌ద్ హుస్సైన్ ఉన్నారు.

ఫ‌జ‌ల్ హ‌క్ ఫ‌రూఖీ వేసిన తొలి రెండు బంతుల్లో రెండు సిక్స‌ర్లు కొట్టాడు. ఆ రెండు బాల్స్ కు ముందు 19వ ఓవ‌ర్ ఐదో బంతికి, అంత‌కు ముందు బంతికి ఫ‌రీద్ అహ్మ‌ద్ మాలిక్ సిక్స‌ర్ బాదాడు.

ఆసిఫ్ అలీ వికెట్ ను పాకిస్తాన్ కోల్పోయింది. వికెట్ ను తీసుకునేందుకు ట్రై చేశాడు. ఫ‌రీద్ చ‌ర్య‌లు న‌చ్చ‌క ఆసిఫ్ అలీ అత‌డిపై బ్యాట్ ఎత్తాడు. చివ‌ర‌కు అంపైర్ జోక్యం చేసుకోవ‌డంతో ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది.

Also Read : ప్రీతి జింటా నా ఆల్ టైమ్ ఫేవ‌రేట్

Leave A Reply

Your Email Id will not be published!