Waqar Younis Wasim Akram : భార‌త్ కు పాండ్యా కాబోయే కెప్టెన్

పాకిస్తాన్ మాజీ పేస‌ర్లు వ‌కార్..అక్ర‌మ్

Waqar Younis Wasim Akram : పాకిస్తాన్ మాజీ ఆల్ పేస‌ర్లు, ఆల్ రౌండ‌ర్లు వ‌కార్ యూనిస్ , వ‌సీం అక్ర‌మ్ లు (Waqar Younis Wasim Akram) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధానంగా భార‌త జ‌ట్టుకు చెందిన స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. భ‌విష్య‌త్తులో టీమిండియాకు అత‌డే కెప్టెన్ కానున్నారంటూ జోష్యం చెప్పారు.

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సూప‌ర్ -12 లీగ్ మ్యాచ్ లో ఒకానొక ద‌శ‌లో ఓడి పోతుంద‌ని అనుకున్న జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని కితాబు ఇచ్చారు. ఈ ఇద్ద‌రు అంత‌ర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

మొద‌ట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జ‌ట్టును ప‌రుగులు తీయ‌నీయ‌కుండా క‌ట్ట‌డి చేశాడు. ఏకంగా కీల‌క‌మైన మూడు వికెట్లు తీశాడు. ఆపై జ‌ట్టు 64 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి స‌పోర్ట్ గా నిలిచాడ‌ని పేర్కొన్నారు.

అస‌లైన క్రికెట‌ర్ ఎలా ఆడాలో, ఎలా ఉండాలో పాండ్యా ను చూసి నేర్చుకోవాల‌ని సూచించారు. ఒత్తిళ్ల‌లో అద్భుతంగా రాణించాలంటే పాకిస్తాన్ క్రికెట‌ర్లే కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడుతున్న ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, పాండ్యాను చూసి నేర్చు కోవాల‌ని పేర్కొన్నారు వ‌కార్ యూనిస్ , వ‌సీం అక్ర‌మ్.

విచిత్రం ఏమిటంటే 2021 ఐపీఎల్ లో పాండ్యా ప‌రిస్థితి జీరో. కానీ ఫీనిక్స్ లాగా తిరిగి స‌త్తా చాటాడ‌ని, 2022 ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌ని తెలిపారు.

Also Read : మ‌న పోరాటం అద్భుతం కానీ ఓడి పోయాం

Leave A Reply

Your Email Id will not be published!