IND vs SL 2nd Test : పంత్ సూప‌ర్ అయ్య‌ర్ అదుర్స్

శ్రీ‌లంక ముందు భారీ టార్గెట్

IND vs SL 2nd Test  : బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రుగుతున్న పింక్ బాల్ టెస్టులో భార‌త జ‌ట్టు త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి భార‌త్ శ్రీ‌లంక జ‌ట్టు ముందు భారీ టార్గెట్ ముందుంచింది.

9 వికెట్లు కోల్పోయి 303 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బ‌రిలోకి దిగిన లంకేయులు ఆడేందుకు త‌బ‌డుతున్నారు. ఊహించ‌ని రీతిలో బంతి బౌన్స్ అవుతూ వ‌స్తోంది.

దీంతో భార‌త బౌల‌ర్లు (IND vs SL 2nd Test )త‌మ స‌త్తా చాటుతున్నారు. ప్ర‌స్తుతం రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి లంక ఒక వికెట్ కోల్పోయి 28 ప‌రుగులు చేసింది. టీమిండియాపై విక్ట‌రీ సాధించాలంటే లంక చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.

ఇంకా 419 ర‌న్స్ చేయాల్సి ఉంది. ఇది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఒక‌వేళ డ్రా చేసుకోవాల‌న్నా చాలా శ్రమించాల్సి ఉంటుంది. మొహాలీ వేదిక‌గా జ‌రిగిన ఫ‌స్ట్ టెస్టులో భార‌త్ ఇన్నింగ్స్ విజ‌యం సాధించింది.

రెండో టెస్టులో సైతం విక్ట‌రీ సాధించేందుకు రెడీ అవుతోంది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మ‌రోసారి రాణించారు భార‌త ఆట‌గాళ్లు రిష‌బ్ పంత్, శ్రేయాస్ అయ్య‌ర్.

పంత్ 31 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 50 ప‌రుగులు చేస్తే శ్రేయస్ అయ్య‌ర్ 87 బంతులు ఎదుర్కొని 67 ప‌రుగులు చేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో త‌న బౌలింగ్ తో దుమ్ము రేపిన బుమ్రా మ‌రోసారి త‌న ప్ర‌తాపాన్ని చూపాడు.

తిరిమ‌న్నేను డ‌కౌట్ చేశాడు. ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో మ‌నోడు 5 వికెట్లు తీశాడు. క్రీజులో క‌రుణ ర‌త్నే, కుశాల్ మెండీస్ ఉన్నారు.

Also Read : ఝుల‌న్ గోస్వామి సంచ‌ల‌నం

Leave A Reply

Your Email Id will not be published!