Parawada Pharma Incident : మరోసారి పరవాడ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం

కాగా,పరవాడ ఫార్మాసిటీలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి...

Parawada Pharma : పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కార్మికులు, కంపెనీ యాజమాన్యం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Parawada Pharma Incident

కాగా,పరవాడ(Parawada) ఫార్మాసిటీలో వరస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ 26న జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని ఠాగూర్‌ ఫార్మా లేబొరేటరీలో విషవాయవులు లీక్ అయ్యాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులంతా ఒక్కసారికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదకర వాయువులు విడుదల కావడంతో అందరూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన కార్మికుడు మృతిచెందగా.. 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబ నాయుడు సైతం స్పందించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

అలాగేడిసెంబర్ 6వ తేదీన ఫార్మాసిటీలోని శ్రీ ఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో మరో ప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్ బ్లాక్‌లోని డ్రయర్ యంత్రం నుంచి ప్రొడక్ట్ బయటకు తీసేందుకు కార్మికులు మ్యాన్ హోల్ ఓపెన్ చేశారు. దీంతో ప్రమాదవశాత్తూ కెమికల్స్ ఇద్దరి కార్మికులపై పడి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించగా.. ప్రాణాపాయం తప్పింది. వరస ఘటనలతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Also Read : Donald Trump : టెస్లా అధ్యక్షుడు ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరు

Leave A Reply

Your Email Id will not be published!