Sourav Ganguly : పార్లమెంట్ స‌త్కారం ‘దాదా’ ఆనందం

ఓ బెంగాలీగా గ‌ర్వ ప‌డుతున్నాన్న గంగూలీ

Sourav Ganguly : భార‌త క్రికెట్ జ‌ట్టులో త‌న‌కంటూ ఓ స్పెషాలిటీని సంపాదించుకున్న క్రికెట‌ర్ గా పేరుంది బెంగాల్ కు చెందిన సౌర‌వ్ గంగూలీ. ఇటీవ‌లే 50 ఏళ్ల‌లోకి అడుగు పెట్టాడు. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ లో ఆడుతోంది.

భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ)కి ప్రెసిడెంట్ గా ఎన్నిక‌య్యాక సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly) మ‌రింత దూకుడు పెంచాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చీఫ్ రేసులో ఉన్నాడు ఈ దాదా.

ప‌శ్చిమ బెంగాల్ వాసులంతా గంగూలీని త‌మ ఆరాధ్య దైవంగా భావిస్తారు. అంతే కాదు అత‌డిని ముద్దుగా దాదా, బెంగాల్ టైగ‌ర్ , యువ రాజు గా పిలుచుకుంటారు.

ఇదిలా ఉండ‌గా భార‌త క్రికెట్ జ‌ట్టును ఏక‌ప‌క్షంగా శాసిస్తూ వ‌స్తున్న ముంబై ఆధిపత్యానికి చెక్ పెట్టిన ఘ‌న‌త హైద‌రాబాదీ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ కు ద‌క్కుతుంది. అత‌డి కెప్టెన్సీలోనే గంగూలీ(Sourav Ganguly) ఎంట్రీ ఇచ్చాడు.

ఆ త‌ర్వాత అత‌డికి సంపూర్ణ మ‌ద్ద‌తు ఇచ్చాడు. ఇప్ప‌టికీ త‌ను మ‌రిచి పోడు అజ్జూ భాయ్ ని. ఇక పోతే బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీకి అరుదైన గౌర‌వం ల‌భించింది.

2002 నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైన‌ల్ లో టీమిండియా సాధించి జూలై 13వ తేదీతో 20 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా బ్రిటీష్ పార్ల‌మెంట్ ప్ర‌త్యేకంగా ఆహ్వానించింది.

ఘ‌నంగా సౌర‌వ్ గంగూలీని స‌త్క‌రించింది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా వెల్ల‌డించాడు జాతీయ మీడియా ఏఎన్ఐకి. ఓ బెంగాలీగా చాలా గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు చెప్పాడు బీసీసీఐ బాస్.

Also Read : రాణించ‌డం కోహ్లీ చేతుల్లోనే ఉంది

Leave A Reply

Your Email Id will not be published!