Parthiban : రెహమాన్ ఎవరికీ లొంగడు – పార్తీపన్
దర్శకుడు సంచలన కామెంట్స్
Parthiban : అల్లా రఖా రెహమాన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏ ముహూర్తాన దర్శకుడు మణిరత్నం తీసుకు వచ్చాడో కానీ ఆనాటి రోజా నుంచి నేటి దాకా తనదైన శైలితో దూసుకు పోతున్నాడు.
ఇప్పటికే ఆస్కార్ అవార్డు కూడా స్వంతం చేసుకున్న రెహమాన్ రేంజే వేరు. ఎన్ని కోట్లు ఇచ్చినా సరే తనకు నచ్చితేనే చేస్తాడు లేదంటే మౌనంగా ఉంటాడు. మొత్తంగా చెప్పాలంటే ఈ దిగ్గజ దర్శకుడు వెరీ వెరీ డిఫరెంట్.
తాజాగా తమిళ దర్శకుడు పార్తీపన్ సంచలన కామెంట్స్ చేశాడు రెహమాన్ గురించి. అదేమిటంటే దేవుడినైనా మార్చగలమేమో కానీ రెహమాన్ ను మార్చడం ఎవరి తరం కాదన్నాడు.
తను పూర్తి క్లారిటీ వచ్చే దాకా, అనుకున్న పనిని 100 శాతం ఉండేలా చేయడంలో తనకు తనే సాటి అని కితాబు ఇచ్చాడు రెహమాన్. కాగా తాజాగా దర్శకుడు పార్తీపన్(Parthiban) ఇరవిన్ నిళల్ అనే సినిమా తీశాడు.
దీనికి దర్శకుడు, కథానాయకుడు కూడా పార్తీపనే కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమాను ఈనెల 24న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు పార్తీపన్. సంగీత దర్శకుడు రెహమాన్ కాదంటే ఈ సినిమా ఇలా వచ్చి ఉండేది కాదన్నాడు.
ఇదిలా ఉండగా ఈ సినిమాను సింగిల్ షాట్ లో తెరకెక్కించాడు పార్తీపన్. ఇది గిన్నిస్ బుక్ రికార్డుకు ఎక్కింది. ఇరవిన్ నిళల్ మూవీకి రెహమాన్ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలై పులి ఎస్. ధాను పొందాడు.
ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టాడు దర్శకుడు పార్తీపన్(Parthiban). మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించి నేటితో 30 ఏళ్లు అవుతోంది.
ఈ సందర్భంగా రెహమాన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్ కూడా హాజరయ్యాడు.
Also Read : ఇండియన్ రెస్టారెంట్ లో జానీ డెప్ సెలబ్రేషన్స్