Pat Commins : క‌మిన్స్ కామెంట్స్ క‌ల‌కలం

ఆసిస్ స‌మిష్టి విజ‌యం

Pat Commins : అహ్మదాబాద్ – గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ వేదిక‌గా మోతేరా స్టేడియంలో జ‌రిగిన కీల‌క ఫైన‌ల్ పోరులో ఊహించ‌ని రీతిలో జైత్ర‌యాత్ర సాగిస్తూ వ‌స్తున్న రోహిత్ శ‌ర్మ సార‌థ్యంలోని భార‌త జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆస్ట్రేలియా. ఆ జ‌ట్టు స్కిప్ప‌ర్ పాట్ కమిన్స్ మ్యాచ్ కంటే ముందే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌ను చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. క‌ప్ గెలిచాక కూడా త‌ను చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Pat Commins Comments Viral

కేవ‌లం ఒకే ఒక్క మాట అన్నాడు పాట్ క‌మిన్స్(Pat Commins). స్టేడియంలో ల‌క్షా 30 వేల మందికి పైగా మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు. వారి మ‌ద్ద‌తుతో స్టేడియం హోరెత్తుతోంది. మేం అభిమానుల ఆద‌ర‌ణ‌ను ఆహ్వ‌నించాయి. కానీ వీరిని నిశ్శ‌బ్దంగా ఉంచ‌డంలో ఉన్నంత సంతృప్తి ఇంకెందులో ఉంటుంద‌న్నాడు.

త‌ను ఏ మాట అన్నాడో పాట్ క‌మిన్స్ చెప్పి చేసి చూపించాడు. నిజ‌మైన కెప్టెన్ ఎలా ఉండాలో అలా ఉన్నాడు. త‌నే ముందుండి జ‌ట్టును విజ‌య ప‌థంలో న‌డిపించాడు స్కిప్ప‌ర్. టాస్ గెలిచిన వెంట‌నే భార‌త జ‌ట్టును నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కే చాప చుట్టేసేలా చేశాడు.

అనంత‌రం మైదానంలోకి దిగిన ఆస్ట్రేలియా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ల‌బూషేన్ , ట్రావిస్ హెడ్ లు భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. త‌మ దేశానికి అరుదైన గౌర‌వం ద‌క్కేలా చేశారు. కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 241 ర‌న్స్ ను ఛేదించింది.

Also Read : Travis Head : బెంబేలెత్తించిన ట్రావిస్ హెడ్

Leave A Reply

Your Email Id will not be published!