Pat Cummins Pujara : పుజారాకు కమిన్స్ అరుదైన గిఫ్ట్
సంతకంతో కూడిన జెర్సీ బహూకరణ
Pat Cummins Pujara : ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ టెస్టు లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ టెస్టు భారత జట్టు ఓపెనర్ ఛతేశ్వర్ పుజారాకు కీలకం. ఎందుకంటే తన కెరీర్ లో ఇది 100వ టెస్టు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 262 పరుగులకే ఆలౌటైంది. వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పుజారా(Pujara) నిరాశ పరిచాడు. కానీ రెండో ఇన్సింగ్స్ లో భారత్ టార్గెట్ కేవలం 115 పరుగులు మాత్రమే. అప్పటికే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది.
వారిలో కేఎల్ రాహుల్ , విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. కానీ ఛతేశ్వర్ పుజారా అడ్డుగోడలా నిలబడ్డాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 31 రన్స్ కొట్టాడు. చివరకు విన్నింగ్ షాట్ తో అలరించాడు పుజారా. దీంతో ప్రత్యర్థి జట్టు ఆసిస్ కెప్టెన్ పాట్ కమిన్స్ సర్ ప్రైజ్ చేశాడు. అద్భుతమైన గిఫ్ట్ ను ఛతేశ్వర్ పుజారాకు అందజేశాడు.
జెర్సీపై సంతకం చేసి పుజారాకు డ్రెస్సింగ్ రూమ్ లో అందజేశాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఆటలో ప్రత్యర్థులైనప్పటికీ బయట అంతా ఒక్కటేనని పాట్ కమిన్స్(Pat Cummins Pujara) చాటాడని క్రికెట్ ఫ్యాన్స్ అభినందనలతో ముంచెత్తున్నారు.
ప్రత్యర్థి జట్టు కెప్టెన్ 100వ టెస్టు ఆడుతున్న ప్లేయర్ కు జెర్సీ బహుమతి ఇవ్వడం ఆనవాయితీ. ఆసిస్ టూర్ లో రహానే నాథన్ లయాన్ కు జెన్సీని కానుకగా ఇచ్చాడు.
Also Read : రంజీ ట్రోఫీ విజేత సౌరాష్ట్ర
IND vs AUS Win 2nd Test : రెండో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ