Pawan Kalyan : సీట్ల పంపకంపై బాబు..పవన్ ఫోకస్
ఎన్ని కేటాయించాలనే దానిపై చర్చ
Pawan Kalyan : హైదరాబాద్ – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా సోమవారం బాబు పవన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్బంగా చంద్రబాబుకు సాదర స్వాగతం పలికారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
Pawan Kalyan Focus on Seats
బాబు, పవన్ మధ్య గంటకు పైగా సమావేశం అయ్యారు. ప్రధాన అంశాలపై చర్చలు జరిగాయి. కానీ ప్రధానంగా ఏపీలో ఉన్న 175 సీట్లకు గాను ఎన్ని సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలనే దానిపై క్లారిటీ రాలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కనీసం 45 సీట్లకు పైగా ఇవ్వాలని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చంద్రబాబు నాయుడును కోరినట్లు టాక్.
ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి సంయుక్తంగా ముందుకు వెళతామని ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ స్కాం కేసులో 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు.
జైలులో ఉన్న బాబును పరామర్శించారు పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్. ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశారు పవన్ . రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి ముందుకు సాగుతాయని వెల్లడించారు.
Also Read : Nagendra Babu : తెలంగాణలో ఓటు వేయలేదు