Pawan Kalyan Viswanath : దిగ్గజ దర్శకుడు కళాతపస్వి
నటుడు పవన్ కళ్యాణ్
Pawan Kalyan Viswanath : కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ ఇక లేరన్న వార్త నన్ను కలిచి వేసింది. నన్ను అత్యంత బాధకు గురి చేసింది. నేను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనను ఇంట్లో కలుసుకున్నాం. ఈ సందర్భంగా సన్మానం కూడా చేశాం. వారి ఆశీర్వాదం తీసుకున్నా. ఆయన తీసిన శంకరా భరణం చూసి నేను ఇంప్రెస్ అయ్యానని అన్నారు నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan Viswanath). శుక్రవారం విశ్వనాథ్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
కళా హృదయం కలిగిన మహోన్నత దర్శకుడు అని ప్రశంసించారు. ఇదిలా ఉండగా కె. విశ్వనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఆయనను ఎన్నో అవార్డులు , పురస్కారాలు వరించాయి. 2017లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయననను ఘనంగా సత్కరించింది. 1992లో పద్మశ్రీ అవార్డు దక్కింది.
కె. విశ్వనాథ్ స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన వయస్సు 92 ఏళ్లు. తన జీవితాన్ని సౌండ్ రికార్డిస్ట్ గా ప్రారంభించారు. కొంత కాలం సహాయ దర్శకుడిగా పని చేశారు. 1961లో ఆత్మ గౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన కుల వ్యవస్థ, వైకల్యం, అంటరానితనం, లింగ వివక్ష, వరకట్నం, సామాజిక ఆర్థిక సవాళ్లు వంటి ఇతివృత్తాలతో 50 కి పైగా తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
చెల్లెలి కాపురం, కాలం మారింది, శారద, ఓ సీత కథ, జీవన జ్యోతి , సిరి సిరి మువ్వ, శంకరా భరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతి ముత్యం, శృతి లయలు, స్వర్ణ కమలం, సూత్ర ధారులు, ఆపద్భాంధవుడు, స్వాతి కిరణం చిత్రాలు ఎన్నదగినవి. హిందీలో కామ్ చోర్ , శుభ్ కామ్నా, ఈశ్వర్ , ధన్వాన్ తీశారు.
Also Read : తండ్రిని కోల్పోయాను – చిరంజీవి