Pawan Kalyan – Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కోటి రూపాయల చెక్కును విరాళాన్ని అందజేసిన డీసీఎం పవన్
సీఎం రేవంత్ రెడ్డికి కోటి రూపాయల చెక్కును విరాళాన్ని అందజేసిన డీసీఎం పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. బుధవారం నాడు హైదరాబాద్ వచ్చిన ఆయన.. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎంను కలిశారు. తెలంగాణ భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కోటి రూపాయల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు డీసీఎం పవన్. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. పవన్ కల్యాణ్, రేవంత్ రెడ్డి వెంట పలువురు కాంగ్రెస్, జనసేన నేతలు పాల్గొన్నారు.
Pawan Kalyan Handover..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో మున్నేరు వాగు.. ఏపీలో బుడమేరు పొంగి పొర్లాయి. మహోగ్రరూపం దాల్చిన మున్నేరు ఖమ్మంను ముంచెత్తగా.. బుడమేరు విజయవాడను ముంచేసింది. ఈ వరదలకు పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేల కోట్లలో ఆస్తి నష్టం వాటిళ్లింది. ఈ నేపథ్యంలో వదర బాధితులకు అండగా తన వంతు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తన సొంత నిధుల నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరి కోటి రూపాయలు విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీకి ప్రకటించిన రూ. కోటి విరాళానికి సంబంధించి చెక్కును అందజేశారు. అదే సమయంలో ముంపునకు గురైన గ్రామాలకు.. రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు పవన్. ఇక తెలంగాణకు సైతం కోటి విరాళం ప్రకటించిన పవన్.. బుధవారం నాడు ఆ విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
Also Read : Amit Shah : సైబర్ నేరాలను అరికట్టడానికి ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం