Pawan Kalyan : జ‌న‌సేనానికి జ‌న నీరాజనం

10వ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ

Pawan Kalyan Machilipatnam : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ 10వ వార్షికోత్స‌వానికి భారీ ఎత్తున జ‌నం హాజ‌రయ్యారు. అంత‌కు ముందు విజ‌య‌వాడ నుంచి మ‌చిలీప‌ట్నం పొట్టి శ్రీ‌రాములు పుణ్య వేదిక వ‌ద్ద‌కు చేరుకున్నారు. అశేష జ‌న వాహిని నినాదాలు, హ‌ర్ష ధ్వానాల మ‌ధ్య జ‌న‌సేనాని వారాహి ప్ర‌చార ర‌థం ద్వారా అభివాదం చేశారు. జ‌న‌సేన పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగ‌తం ప‌లికారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై(Pawan Kalyan Machilipatnam) పూల వ‌ర్షం కురిపించారు.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం నుండే కాక తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మ‌చిలీప‌ట్నంలో జ‌రుగుతున్న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు త‌ర‌లి వ‌చ్చారు. మొత్తం ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి చూసుకున్నారు మాజీ ఉమ్మ‌డి ఏపీ రాష్ట్ర స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్. అన్నీ తానై అయ్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న‌సేన పార్టీకి పీఏసీ చైర్మ‌న్ గా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌త 9 ఏళ్ల‌లో ఏపీలో జ‌న‌సేన పార్టీ ఏం చేసిందో ప్ర‌జ‌ల‌కు చెప్పారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక్క‌డ ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు. స‌భ‌కు కూడా ఆటంకం క‌లిగించార‌ని ఆరోపించారు. స‌మాజం హ‌ర్షించ‌ద‌ని, మూడు రాజ‌ధానుల పేరుతో జ‌నాన్ని మోసం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు నాదెండ్ల మ‌నోహ‌ర్. రోడ్లు అధ్వాన్న స్థితిలో ఉన్నాయ‌ని , ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. భారీ ఎత్తున జ‌నం జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌కు వ‌చ్చారు. స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేసిన ఘ‌న‌త సీఎందేన‌ని పేర్కొన్నారు.

Also Read : ప్ర‌జా ప‌క్షం స‌మ‌స్య‌ల‌పై యుద్దం

Leave A Reply

Your Email Id will not be published!