V Muralidharan : మురళీధరన్ తో పవన్ ముచ్చట
ఏపీ అంశాలపై చర్చలు
V Muralidharan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఫుల్ బిజీగా గడిపారు. పీఎం మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఆ వెంటనే కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వి. మురళీధరన్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
V Muralidharan Words
ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు. అక్కడి ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు ఆసరా ఇవ్వాలని కోరారు.
పవన్ కళ్యాణ్ సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని త్వరలోనే వీటిపై చర్చిస్తామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వి. మురళీధరన్(V Muralidharan) హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా జనసేన పార్టీ బీజేపీతోనే ఉంటుందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర ఏపీలో చేపట్టారు. తొలి విడత సక్సెస్ అయ్యింది. రెండో విడత కొనసాగుతోంది. ఈ సమయంలో తమ పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీని కలిశారు. ఆ వెంటనే ఢిల్లీకి వచ్చారు పవన్ కళ్యాణ్.
Also Read : Pawan Kalyan : అమిత్ షా తో పవన్ కళ్యాణ్ భేటీ