Pawan Kalyan : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం
మరునాడు(నవంబర్ 17) విదర్భ ప్రాంతానికి వెళ్లనున్నారు...
Pawan Kalyan : డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం అక్కడకు వెళ్లనున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. ఈనెల 16, 17 తేదీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజియన్లలో ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రచార షెడ్యూల్ ఖరారైంది. పవన్ మహారాష్ట్ర పర్యటనపై బీజేపీ జాతీయ స్థాయి, మహారాష్ట్ర నాయకులు.. జనసేన నాయకులతో చర్చించారు. అనంతరం షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. రెండు రోజుల పాటు ప్రచారంలో భాగంగా ఐదు బహిరంగ సభల్లో, రెండు రోడ్ షోలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పాల్గొననున్నారు.
Pawan Kalyan will participate..
మొదటిరోజు మరట్వాడా ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పవన్ ప్రచారం చేయనున్నారు. 16వ తేదీన ఉదయం నాందేడ్ జిల్లా డెగ్లూర్ నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అనంతరం అదే జిల్లాలో భోకర్ నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు లాతూర్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రాత్రి ఆరు గంటలకు షోలాపూర్ నగరంలో రోడ్ షోలో పవన్ పాల్గొననున్నారు.
మరునాడు(నవంబర్ 17) విదర్భ ప్రాంతానికి వెళ్లనున్నారు. ఆరోజు ఉదయం చంద్రపూర్ జిల్లాలోని బల్లార్ పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పాల్గొంటారు. సాయంత్రం పూణె కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్భాపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఎన్డీఏ కూటమికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు. ఈ మేరకు జనసేన కార్యాలయం ఈరోజు (శుక్రవారం) ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది.
Also Read : Minister Payyavula Keshav : చివరకు జగన్ ప్రభుత్వం చిన్నపిల్లల చక్కిల్లోనూ 175కోట్ల బకాయిలు పెట్టింది