Pawan Kalyan: పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి – పవన్‌ కళ్యాణ్‌

పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లిపోండి - పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : పహాల్గాం ఉగ్రదాడి ఘటనలో పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నిప్పులు చెరిగారు. జమ్మూ అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులను మతం అడిగి మరి అత్యంత పాశవికంగా హత్య చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు అనుకూలంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. అంతేకాదు మత ప్రాతిపదికన 26 మందిని చంపినా పాక్‌ కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని… అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. మత ప్రాతిపదికన ప్రజలను చంపడం సరికాదన్నారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌ లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్‌లో హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మృతులకు నివాళులు అర్పించారు.

Pawan Kalyan Slams

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. కశ్మీర్‌ భారత్‌ లో భాగమని, ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ రావు కుటుంబానికి పార్టీ తరఫున రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్రదాడి ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందని అన్నారు.

‘‘సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి. చనిపోయిన మధుసూదన్‌రావు ఎవరికి హాని చేశారు ?. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్‌ కు వెళ్తే చంపేశారు. కశ్మీర్‌ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి ?. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి’’ అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Also Read : Enforcement Directorate: భూదాన్‌ ల్యాండ్‌ స్కామ్ పై ఈడీ సంచలన ప్రకటన

Leave A Reply

Your Email Id will not be published!