Pawan Kalyan : తమిళ సినీ రంగంపై పవన్ కామెంట్స్
ఇతర భాషా చిత్రాలు, నటీ నటులను ప్రోత్సహించాలి
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ అన్ని భాషలకు చెందిన నటీ నటులను , సాంకేతిక రంగ నిపుణులను ఆదరిస్తోందని స్పష్టం చేశారు. కానీ తమిళ సినీ పరిశ్రమ ఎందుకనో ఇతర సినీ రంగాలకు చెందిన నటీ నటులను, సాంకేతిక రంగ నిపుణులను, సినిమాలను ఆదరించడం లేదని వాపోయారు. ఇక నుంచి తమిళ చిత్ర పరిశ్రమ కూడా ప్రోత్సహిస్తే ఎస్ఎస్ రాజమౌళి తీసిన దిగ్గజ సినిమా ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచ చిత్రాలను అందించ గలదని అన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Comment
ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే సౌత్ ఇండియన్ తమిళ సినిమా అసోసియేషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. కేవలం తమిళ సినిమాలను మాత్రమే ప్రోత్సహించాలని, ఇక్కడి వారికే ఛాన్స్ ఇవ్వాలంటూ ఆదేశించింది. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
దీనిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీరియస్ కామెంట్స్ చేశారు. ఇవాళ సినిమా అన్నది ఎల్లలు లేని ప్రపంచమని , కేవలం ఒక ప్రాంతానికే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో బ్రో ది వారియర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Also Read : Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తజనం సుమారు 74వేలమంది