Pawan Kalyan : ‘ద్వారంపూడి’ ఓ రౌడీ – పవన్ కళ్యాణ్
నీకు బేడీలు వేయకపోతే చూడు
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో నిన్ను ఓడించడమే తన లక్ష్యమన్నారు. సినిమాల్లో లాగా రౌడీలను పెట్టుకుని ఉన్నానని అనుకుంటున్నావేమో కానే కాదు నీకు బేడీలు వేయించే దాకా నిద్ర పోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
నిజ జీవితంలో చంద్రశేఖర్ రెడ్డి లాంటి క్రిమినల్స్ ను ఎదుర్కోవాలంటే దమ్ము, ధైరం ఉండాలని ఆ ఖలేజా తనకు ఉందన్నారు జనసేన పార్టీ చీఫ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ చూసుకుని ద్వారంపూడి రెచ్చి పోతున్నాడని తాట తీస్తానంటూ హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన మహిళలను ఇబ్బంది పెట్టాడని ఇక పుట్టగతులు ఉండవని అన్నారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఎమ్మెల్యేను డెకాయిట్ అంటూ నిప్పులు చెరిగారు. ఆయన కబ్జాల సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి తీరుతానని శపథం చేశారు. తన పేరు పవన్ కళ్యాణ్ కాదన్నారు. ద్వారంపూడి ఎమ్మెల్యే కాదు ఓ గూండా..ఓ రౌడీ.. నిన్ను అడ్డుకుంటా. మంగళగిరిలోనే ఉంటానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఎవరు వస్తారో చూసుకుంటానని సవాల్ విసిరారు. గతంలో ఎన్నడూ లేనంతగా తన వాయిస్ ను పెంచారు.
ప్రస్తుతం వారాహి విజయ యాత్ర కాకినాడలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా జనసేన పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : Bhagwant Mann : రాజస్థాన్ లో ఆప్ దే రాజ్యం – మాన్