Pawan Kalyan : గెలుపు ఖాయం అధికారం తథ్యం
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నికల్లో రాక్షస పాలన కొనసాగిస్తున్న జగన్ పార్టీకి మంగళం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్లకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan Challenge
తమ పార్టీల మధ్య నెలకొన్న పొత్తు , అనుబంధం ఓ దశాబ్ద కాలం పాటు ఉండాలన్నారు. రాష్ట్ర విభజన నష్టాన్ని పూర్తి చేసుకోవాలంటే చాలా కష్ట పడాలని సూచించారు. తన కోసం తాను పని చేయడం లేదన్నారు పవన్ కళ్యాణ్.
ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలని తాను ప్రయత్నం చేస్తున్నానని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. యువత, మహిళా బలం వల్లే జనసేన మరింత పటిష్టంగా నడుస్తోందన్నారు. దీనిని గమనించే తాను ఎక్కువగా రాష్ట్రంలో పర్యటించడం జరుగుతోందని తెలిపారు.
ఇవాళ ఏపీ దిక్కు లేనిదిగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). దీనిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింలు మైనార్టీలు కాదని వారు మెయిన్ స్ట్రీమ్ నాయకులంటూ కితాబు ఇచ్చారు జనసేన పార్టీ చీఫ్. ఒకవేళ మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషిగా సాయం చేస్తానని ప్రకటించారు.
Also Read : Nara Lokesh : వయో పరిమితి పెంచాలి – లోకేష్