Pawan Kalyan : ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడ‌తా – ప‌వ‌న్

జ‌న‌సేన పార్టీ చీఫ్ సంచ‌ల‌న కామెంట్స్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న ఏపీ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేశారు. త‌న‌ను ప్యాకేజ్ స్టార్ అని ఎవ‌రైనా అంటే వాళ్ల‌ను , ఆ వెధ‌వ‌ల‌ను చెప్పుతో కొడ‌తాన‌ని హెచ్చ‌రించారు. తాను ఇక నుంచి కూల్ గా ఉండ‌న‌ని ఇక నుంచి పోరాటం చేస్తాన‌ని అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పును చూపించి మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇంత కాలం స‌హ‌నం పాటించాన‌ని ఇక ఊరుకోన‌న్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే తోలు తీస్తాన‌ని అన్నారు. ఇప్ప‌టి దాకా స‌హ‌నం పాటించాన‌న్నారు.

ప్ర‌తి సారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నావ‌ని అంటున్నార‌ని ద‌మ్ముంటే మీరు చేసుకోండ‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌ధానంగా కాపు కులానికి చెందిన ఎమ్మెల్యేల‌పై నిప్పులు చెరిగారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఒక పెళ్లి చేసుకుని ఇంకొంద‌రితో తిరిగే మీరా న‌న్ను విమ‌ర్శించేది అని ప్ర‌శ్నించారు.

తాను లండ‌న్ , న్యూయార్క్ లో పెరగ‌లేద‌ని బాప‌ట్ల‌లో పుట్టాన‌ని గొడ్డు కారం తిరిగి పెరిగాన‌ని అన్నారు. ఇంకోసారి గ‌నుక ప్యాకేజీ అని మాట్లాడితే ఉరికించి కొడ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలో కొంద‌రు నాయ‌కుల‌ను కొడ‌క‌ల్లారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). వైసీపీ గూండా ఎమ్మెల్యేల్లారా అని మండిప‌డ్డారు.

ఇప్ప‌టి దాకా మంచిత‌నం చూశారు. స‌హ‌నం చూశారు. కానీ ఇక నుంచి డైరెక్టుగా యుద్దానికి సిద్ద‌మ‌న్నారు. ద‌మ్ముంటే నాతో యుద్దానికి రావాల‌న్నారు. రాడ్ ల‌తోనా హాకీ స్టిక్కుల‌తోనా దేంతోనైనా రండి తేల్చుకుందామ‌ని స‌వాల్ విసిరారు.

Also Read : బరిలో ఎంద‌రున్నా ముగ్గురి మ‌ధ్యే పోటీ

Leave A Reply

Your Email Id will not be published!