PBKS v LSG IPL 2022 : జోరు మీదున్న ల‌క్నో జోగుతున్న పంజాబ్

ఈసారైనా కింగ్స్ రాణిస్తారా చేతులెత్తేస్తారా

PBKS v LSG : ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ్యాచ్ కు వేదిక కాబోతోంది పుణె. మ‌యాంక్ అగ‌ర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ , కేఎల్ రాహుల్ నాయ‌క‌త్వంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (PBKS v LSG)త‌ల‌ప‌డ‌నుంది.

ఇరు జ‌ట్లు బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ ల‌క్నో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు పంజాబ్ ఆశించినంత మేర రాణించ లేక పోతోంది. ఇదిలా ఉండ‌గా ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు ఎనిమిది మ్యాచ్ లు ఆడాయి.

పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్ లు గెలిచి 4 మ్యాచ్ లు ఓడి పోయింది. ఇక ల‌క్నో 5 మ్యాచ్ ల‌లో గెలుపొంది 3 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

పంజాబ్ కింగ్స్ జ‌ట్టుకు మ‌యాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ ప‌టేల్ , రిషి ధావ‌న్ , రాజ‌ప‌క్స భ‌నుక‌, జితేశ్ శ‌ర్మ‌, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, క‌గిసో ర‌బ‌డ‌, సందీప్ శ‌ర్మ‌, రాహుల్ చాహ‌ర్, అర్ష‌దీప్ సింగ్ ఆడ‌తారు.

హ‌రిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ , నాథ‌న్ ఎల్లిస్ , ఓడియ‌న్ స్మిత్, మ‌యాంక్ అగ‌ర్వాల్ , రిటిక్ ఛ‌ట‌ర్జీ, రాజ్ బావా, ప్రేర‌క్ మ‌న్క‌డ్ , అథ‌ర్వ తైదే, ప్ర‌భ సిమ్రాన్ సింగ్ , శిఖ‌ర్ ధావ‌న్ , లివింగ్ స్టోన్ , వైభ‌వ్ అరోరా ఆడ‌తారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బ‌దోని, క‌ర్ణ్ శ‌ర్మ‌, కైల్ మేయ‌ర్స్ , అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మ‌యాంక్ యాద‌వ్ , క్వింట‌న్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేస‌న్ హోల్డ‌ర్ ఆడ‌తారు.

మ‌నీష్ పాండే, షాబాజ్ న‌దీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , ర‌వి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్క‌స్ స్టోయినిస్ , మ‌న‌నో వోహ్రా, దుష్మంత్ చ‌మీరా, దీప‌క్ హూడా, కృష్ణ‌ప్ప గౌత‌మ్ ఆడ‌నున్నారు.

Also Read : మార్కోపై ముర‌ళీధ‌ర‌న్ మండిపాటు

Leave A Reply

Your Email Id will not be published!