PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ‘పీసీ ఘోష్ కమిషన్’ ముందుకు మాజీ మంత్రి
ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్, పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసింది...
PC Ghosh Commission : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. విచారణలో భాగంగా కమిషన్ ఎదుట సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నారు. కేసీఆర్ క్యాబినెట్‌లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పని చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే కాళేశ్వం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడిగడ్డలో రెండు ఫిల్లర్లే కుంగాయన్నారు. కాళేశ్వరంతో తెలంగాణలో 35 శాతం భూ భాగానికి నీరందని చెప్పారు. మరోవైపు కేసీఆర్ హయాంలో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ (ప్రస్తుత బీజేపీ ఎంపీ) ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ రోజు హారీష్ రావు విచారణలో ఎం చెబుతారో అన్న దానిపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కాళేశ్వరంకు ఖజానా నుంచి చేసిన చెల్లింపులు, పాటించిన నిబంధనలపై కమిషన్ ఆరా తీయనుంది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ చైర్మన్, పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నావళి సిద్ధం చేసింది.
PC Ghosh Commission – Kaleshwaram Project – Harish Rao
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, డిజైన్, నాణ్యత ప్రమాణాలు, ఆర్థిక అంశాలు వంటి వాటిపై కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఇంజినీర్లను, రిటైర్డ్ ఇంజినీర్లను, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లను స్వీకరించి వాటి ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్), నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) నివేదికలను కూడా కమిషన్ పరిగణలోకి తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాంట్రాక్ట్ సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ బిల్లులు చెల్లించినట్లు కమిషన్ గుర్తించింది.
అలాగే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 11న (బుధవారం) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు స్వయంగా హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. రాజకీయ ప్రతినిధుల విచారణలు తదుపరి కమిషన్ తుది నివేదికను ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేస్తుంది.
Also Read : Woman: ప్రియుడి కోసం భర్త, అత్త, మామలపై విష ప్రయోగం చేసిన మహిళ
