KA Paul Revanth Reddy : రేవంత్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలి
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డిమాండ్
KA Paul Revanth Reddy : బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేసిన ప్రభుత్వం ఎందుకని రేవంత్ రెడ్డిపై మౌనంగా ఉందని ప్రశ్నించారు ప్రజా శాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రగతి భవన్ ను గ్రెనేడ్లతో పేల్చి వేయాలని పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి పట్ల ఎందుకు సానుకూలంగా ఉన్నారని ప్రశ్నించారు. ఏమైనా ములాఖత్ అయ్యారా అన్న అనుమానం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కోట్లు తీసుకుని పార్టీ చీఫ్ పదవి కట్టబెట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లేకపోతే ఇంత మంది సీనియర్ నాయకులు ఉండగా రేవంత్ రెడ్డికే ఎందుకు టీపీసీసీ చీఫ్ గా ప్రకటించారంటూ నిలదీశారు డాక్టర్ కేకే పాల్(KA Paul) . తాను చేసిన ఈ విమర్శలు తప్పని తేలితే వెంటనే రేవంత్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ ను కూల్చాలంటూ పక్కా ఉగ్రవాదిగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని, అవసరమైతే వెంటనే పీడీ యాక్టు పెట్టాలని కోరుతూ డీజీపీకి లేఖ రాశానని చెప్పారు కేఏ పాల్(KA Paul) . పీసీసీ పదవిని డబ్బులకు కొనుగోలు చేసిన రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరని అన్నారు.
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన ఆయనకు రాష్ట్రంలో అంత సీన్ లేదన్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్. ప్రస్తుతం అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ లు, ఐపీఎస్ లు తమ పార్టీలో చేరేందుకు ఉత్సుకత చూపిస్తున్నారంటూ తెలిపారు.
Also Read : రాజన్న రాజ్యం కోసం పోరాటం