Medaram Jatara : తెలంగాణలోని మేడారం వైపు దేశమే కాదు యావత్ ప్రపంచం దృష్టి సారించింది. రేపటి నుంచి 19 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతర(Medaram Jatara )కోసం ముందుగానే భక్తులు భారీగా తరలి వచ్చారు.
ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ ప్రాంతమంతా భక్తులతో అలరారుతోంది. ఎటు చూసినా జనమే.
ఓ మహా సముద్రం ఇక్కడికి వస్తుందా అన్న రీతిలో కొనసాగుతోంది. దేశం నలువైపుల నుంచి మేడారం వైపు వస్తున్నాయి.
అన్ని దారులన్నీ ఇక్కడికి సాగుతున్నాయి. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర ఇదే కావడం విశేషం.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు ఖర్చు చేసింది. గతంలో కంటే ఈసారి 2 కోట్ల మందికి పైగా జనం హాజరవుతారని అంచనా.
కరోనా ఉన్నప్పటికీ నిర్వహిస్తారా లేదా అన్న అనుమానానికి తెర దించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు పచ్చ జెండా ఊపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 3 వేల 845 బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు(Medaram Jatara )వచ్చే భక్తులు తమ కోర్కెలు నెరవేరిన వారు అమ్మ వారికి బంగారం సమర్పించుకుంటారు.
ఇక్కడ బంగారం అంటే అర్థం బెల్లం అని. ఆసియా ఖండంలో ఇలాంటి జన జాతర జరిగేది ఇక్కడే.
అతి పెద్ద ఆదివాసి మహా సమ్మేళనంగా భాసిల్లుతోంది. సమ్మలక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మాఘ పౌర్ణమికి ముందు ఈ జాతర సాగుతుంది.
ఈ గిరిజన జాతరకు తర తరాల ఘనమైన చరిత్ర ఉంది. ఆనాటి కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు వన దేవతలకు సమారాధన ప్రారంభించారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉంది మేడారం. ఇదిలా ఉండగా జానపదులు పాడే గీతాలతో సమ్మక్క సారలమ్మ జీవన గాథలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ మహా జాతరలో భాగంగా మొదటి రోజు మండె మెలిగే పేరుతో పూజ చేస్తారు.
రెండో రోజు మహా ఘట్టంలో మందిర సారె పేరుతో జంట శక్తి మాతలకు చీర సారెల్ని సమర్పిస్తారు. మూడో రోజున నిండు జాతర లక్షలాది భక్తుల సందోహంతో వర్దిల్లుతుంది.
బెల్లపు దిమ్మెల్ని బంగారంగా అమ్మ తల్లులుకు భక్తులు చెల్లిస్తారు. నాలుగో రోజు శక్తి మాతల వన ప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది.
Also Read : ముగిసిన వేలం స్టార్లకు మంగళం