Perni Nani : ఆంధ్రప్రదేశ్ సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని (Perni Nani )ఇవాళ నటుడు మోహన్ బాబుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి కలయిక సినీ, రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
జగన్ రెడ్డితో మోహన్ బాబుకు దగ్గరి బంధుత్వం ఉంది. నిన్న సినిమా రంగానికి చెందిన స్టార్ నటులు, దర్శకులు ఏపీ సీఎం జగన్ రెడ్డితో కలిశారు.
సీఎంను కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ , ఆలీ, పోసాని కృష్ణ మురళితో పాటు దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, ఆర్. నారాయణ మూర్తి, కొరటాల శివ, నిర్మాత నిరంజన్ రెడ్డి ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే చిరంజీవి వెంట మోహన్ బాబు లేరు. ప్రస్తుతం ఆయన తనయుడు మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చీఫ్ గా ఉన్నారు. ఈ తరుణంలో మంత్రి పేర్ని నాని స్వయంగా హైదరాబాద్ కు వచ్చి కలవడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ , విమర్శలు వెల్లువెత్తాయి. జగన్ నిజమైన బాహుబలి. మీరంతా వెళ్లి జీ హుజూర్ అంటూ లొంగి పోయారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ హల్ చల్ గా మారింది.
ఈ సమయంలో మంత్రి పేర్ని నాని(Perni Nani )తానే ఇక్కడికి రావడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి టీంతో సీఎం జగన్ భేటీ వివరాలను మోహన్ బాబుకు మంత్రి పేర్ని నాని వివరించినట్లు సమాచారం.
Also Read : ఏం కావాలన్నా ఇస్తానన్న జగనన్న