Warren Buffett : బెర్క్ షైర్ హాత్ వేకి చైర్మన్ గా ఉన్న వారెన్ బఫెట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనీ కంటే వ్యక్తిగత సంతృప్తి ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయన యువతకు పలు సలహాలు, సూచనలు చేశారు.
డబ్బులు పెట్టుబడి పెట్టిన వెంటనే అప్పుడే రావన్నారు. లేక పోతే సంతృప్తి ఇచ్చే జాబ్ ను వెతుక్కుంటే మంచిదని సూచించారు. డబ్బు వెంట పడవద్దని కెరీర్ ముఖ్యమన్నారు.
లాభం కంటే స్వంత సంతృప్తి గొప్పదన్నారు వారెన్ బఫెట్. జీవితంలో గెలవాలన్నా లేదా విజయం సాధించాలంటే మనీ అత్యంత ముఖ్యమన్నారు.
జాబ్స్ వెతికే పనిలో చాలా మంది యువతకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. తాను మొదటగా పార్ట్ టైమ్ జాబ్ చేశానని పేర్కొన్నారు.
సెక్యూరిటీస్ బిజినెస్ లోకి వచ్చినా తనకు ఆ జాబ్ సంతృప్తి తనకు దొరకలేదన్నారు. చివరకు బెర్క్ షైర్ హాత్ వేలో వెతుక్కున్నామన్నారు. ఎవరైనా సరే అర్థం కాని వ్యాపారాలలో డబ్బులు పెట్టవద్దని సూచించారు.
1965లో బెర్క్ షైర్ హాత్ వేను కొనుగోలు చేశాక అతి పెద్ద ఇన్వెస్ట్ మెంట్ కంపెనీగా ఎదిగిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన యాపిల్ , కోకో కోలా , ఆమెరికన్ ఎక్స్ ప్రెస్ తదితర టాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు వారెన్ బఫెట్(Warren Buffett ).
యువత నిత్యం మారుతున్న పరిస్థితులను గమనించాలని, నిత్యం చదవడం, రాయడం నేర్చు కోవాలని సూచించారు. కొత్త గా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న వారు ఇండెక్స్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చేయాలని అన్నారు వారెన్ బఫెట్.
Also Read : క్యాబ్ డ్రైవర్ గా మారిన సిఇఓ