Petrol Price : మ‌రోసారి వాహ‌నదారుల‌కు షాక్

మ‌ళ్లీ పెంచిన ఆయిల్ కంపెనీలు

Petrol Price  : ఎన్నిక‌లు ముగియ‌డంతో ఆయిల్, గ్యాస్ కంపెనీలు ధ‌ర‌ల్ని పెంచ‌డం స్టార్ట్ చేశాయి. ఇక చ‌ప్ప‌ట్లు కొట్టండి అంటూ ఇప్ప‌టికే ఎద్దేవా చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఆయ‌న మొత్తుకుంటూనే ఉన్నారు.

ఇది ఎన్నిక‌ల స్టంట్ త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని. నాలుగు రాష్ట్రాల‌లో బీజేపీ (BJP) స‌ర్కార్ కొలువు తీరింది. ఎన్నిక‌ల సంద‌ర్భంగా నాలుగు నెల‌ల పాటు పెంచ‌కుండా మౌనంగా ఉన్న కంపెనీలు ఇప్పుడు ధ‌ర‌ల్ని పెంచుతూ మోత మోగిస్తున్నాయి.

తాజాగా లీట‌రు పెట్రోల్ పై 90 పైస‌లు, డీజిల్ పై 87 పైస‌లు పెంచాయి. దీంతో ప‌లు న‌గ‌రాల‌లో ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. హైదరాబాద్ లో లీట‌ర్ పెట్రోల్ రూ. 110కి చేర‌గా డీజిల్ ధ‌ర రూ. 96.36కు చేరింది.

ఇక ఏపీలోని గుంటూరులో పెట్రోల్ లీట‌ర్(Petrol Price )కు రూ. 112.80 గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 98.10 గా ఉంది. ఇక విజ‌య‌వాడ‌లో పెట్రోల్ ధ‌ర రూ. 111.88గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 97.90 కి చేరింది.

ఇదిలా ఉండ‌గా దేశ రాజ‌ధాని ఢిల్లీలో 80 పైస‌లు చొప్పున పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెంచాయి. పెట్రోల్ ధ‌ర రూ. 97.01గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 88.27గా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో పెట్రోల్ లీట‌ర్ ధ‌ర రూ. 111.67 ఉండ‌గా డీజిల్ రూ. 88.27 కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ లీట‌ర్ ధర రూ. 102.91 గా ఉండ‌గా డీజిల్ ధ‌ర రూ. 92.95కి చేరింది.

మ‌రో వైపు ప‌శ్చిమ బెంగాల్ లోని కోల్ క‌తా న‌గ‌రంలో పెట్రోల్ లీల‌ర్ ధ‌ర రూ. 106.34గా ఉండ‌గా డీజిల్ ధ‌ర లీట‌ర్ కు రూ. 91.42గా ఉంది. ఇదిలా ఉండ‌గా ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వ‌స్తుందోన‌ని వాహ‌న‌దారులు ల‌బోదిబోమంటున్నారు.

Also Read : సౌదీ కంపెనీతో అదానీ గ్రూప్

Leave A Reply

Your Email Id will not be published!